Rafale Deal Done: రాఫెల్ డీల్ కంప్లీట్.. భారత్‌కు చేరుకున్న చివరి యుద్ధ విమానం.. వెల్లడించిన ఐఏఎఫ్..

|

Dec 15, 2022 | 4:13 PM

రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్​క్రాఫ్ట్ భారత్​కు చేరింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు 36 విమానాలు అందాయి.

Rafale Deal Done: రాఫెల్ డీల్ కంప్లీట్.. భారత్‌కు చేరుకున్న చివరి యుద్ధ విమానం.. వెల్లడించిన ఐఏఎఫ్..
Iaf Rafales
Follow us on

రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్​క్రాఫ్ట్ భారత్​కు చేరింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు 36 విమానాలు అందాయి. చివరి రాఫెల్ జెట్‌కు సంబంధించి భారత వైమానిక దళం అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘ప్యాక్ ఈజ్ కంప్లీట్. 36 ఐఏఎఫ్ రాఫెల్ జెట్‌లలో చివరిది ఇండియాకు వచ్చేసింది.’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

భారత నౌకాదళానికి సరికొత్త ఆయుధ సంపత్తిని చేర్చే ఉద్దేశ్యంతో సుమారు 9 బిలియన్ డాలర్ల విలువైన రాఫెల్ ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో భారత్ చేసుకుంది. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరుగగా.. ఇందులో భాగంగా జూలై 2020లో ఐదు రాఫెల్ జైట్‌ల తొలి బ్యాచ్ అంబాలాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరాయి. వీటిని 17వ స్క్వాడ్రన్‌లో భాగం చేశారు. వీటిని ‘గోల్డెన్ ఆరోస్’ అంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ‘రాఫెల్ ఒప్పందం జాతీయ భద్రతలో గేమ్ ఛేంజర్. వీటి ప్రవేశం ప్రపంచానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్న దేశాలకు బలమైన సందేశం’ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చివరి నాలుగు యుద్ధ విమానాలలో 3 యుద్ధ విమానాలు భారత్‌కు చేరాయి. ఇప్పుడు చివరి రాఫెల్ ఫైటర్ జెట్ కూడా వచ్చేసింది. దాంతో డీల్ కంప్లీట్ అయ్యింది. కాగా, ఒక్కో జెట్‌కు రూ. 670 కోట్లుగా అంచనా వేశారు. ఈ రాఫెల్ ఫైటర్ జెట్లలో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. హెల్మెట్-మౌంటెడ్ సైట్, రాడార్ వార్నింగ్ రిసీవర్‌లు, డేటా రికార్డర్స్, ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్, ట్రాక్ సిస్టమ్, టోవ్డ్ డికాయ్స్, మిస్సైల్ అప్రోచ్ వార్నింగ్ బెల్స్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

గత నెలలో జరిగిన ‘గరుడ విల్’ ద్వైపాక్షిక విన్యాసాల సందర్భంగా.. భారత వైమానిక దళం(IAF) చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడపగా.. ఫ్రెంచ్ ఎయిర్ చీఫ్ జనరల్ స్టెఫాన్ మిల్లే భారత్‌కు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాన్ని నడిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..