Army MIG-21 Crash: ఇంటిపై కూలిన MiG-21 యుద్ధ విమానం.. ఇద్దరు మహిళలు మరణించగా.. పారాచూట్‌తో దూకిన పైలట్..

మిగ్-21 క్రాష్ కారణంగా ఇద్దరు మహిళలు మరణించారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు.పైలట్ గాయపడి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Army MIG-21 Crash:  ఇంటిపై కూలిన MiG-21 యుద్ధ విమానం.. ఇద్దరు మహిళలు మరణించగా.. పారాచూట్‌తో దూకిన పైలట్..
Army Mig 21 Crash
Follow us
Sanjay Kasula

|

Updated on: May 08, 2023 | 12:00 PM

భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఈ ఉదయం రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ సమీపంలో కుప్పకూలింది. సూరత్‌గఢ్‌ నుంచి విమానం బయలుదేరింది. విమానం పడిపోవడంతో ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి గాయపడ్డారు. పైలట్ గాయపడి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం ఒక ఇంటిపై పడింది. దీని కారణంగా ఇద్దరు మహిళలు మరణించారు. అదే సమయంలో పైలట్ పారాచూట్ సాయంతో విమానం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

గత జనవరిలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో రెండు IAF ఫైటర్ జెట్‌లు సుఖోయ్ SU-30, మిరాజ్-2000 శిక్షణ సమయంలో కూలిపోయాయి. ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది.

శిక్షణ సమయంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. అదే సమయంలో, గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. శిక్షణ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో ఏప్రిల్‌లో కొచ్చిలో మరో ప్రమాదం జరిగింది.

అక్టోబర్‌లో కూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు..

గతేడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 5, 2022న, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతానికి సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోయి, భారత ఆర్మీ పైలట్ మరణించాడు. కొన్ని రోజుల తరువాత, అక్టోబర్ 21 న, భారత సైన్యానికి చెందిన ఏవియేషన్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు రక్షణ సిబ్బంది మరణించారు. ఇది టూటింగ్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని సియాంగ్ గ్రామ సమీపంలో కూలిపోయింది.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే