AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమ ఆసియాలో శాంతి దిశగా అడుగులు.. అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, నౌకాయాన రాకపోకలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని పేర్కొన్నారు.

Pm Narendra Modi
Balaraju Goud
|

Updated on: Jun 15, 2026 | 1:23 PM

Share

అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, నౌకాయాన రాకపోకలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సోమవారం (జూన్ 15) సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆసియాలో కొనసాగిన ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు. ఈ ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు, వాణిజ్య కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

ఈ ఒప్పందం విజయవంతంగా అమలైతే ప్రాంతీయ స్థాయిలో శాంతి వాతావరణం నెలకొంటుందని, సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ ప్రాంతంలో స్థిరత్వం రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం మిగిలి ఉన్న వివాదాస్పద అంశాలపై కూడా ఇరు దేశాలు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. సంభాషణ, దౌత్య మార్గాల ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనడం భారతదేశానికి కూడా కీలకమే. ఎందుకంటే ఆ ప్రాంతంతో భారత్‌కు ఇంధన, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని భారత్ సానుకూల పరిణామంగా చూస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది

ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..

చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..

వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే

జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..

క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు

సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర