Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: 11 ఏళ్లు.. 11 అతిపెద్ద నిర్ణయాలు.. ప్రధాని మోదీ పాలనలో అమృతకాలం..

సరిగ్గా 11 సంవత్సరాల క్రితం, దూరదృష్టి కలిగిన ఒక నాయకుడు భారత రాజకీయాల్లో అతిపెద్ద సింహాసనాన్ని అధిష్టించారు. ఆయన పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ! 11 ఏళ్ల క్రితం భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారంతో, దేశంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.

PM Modi: 11 ఏళ్లు.. 11 అతిపెద్ద నిర్ణయాలు.. ప్రధాని మోదీ పాలనలో అమృతకాలం..
PM Modi
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 11, 2025 | 4:47 PM

ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్టీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 11 ఏళ్లలో ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంతోబాటు..తన ప్రజా సంక్షేమ విధానాలతో దేశ దశను-దిశను కూడా మార్చారు. సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీ భారత ప్రధానిగా ఎదిగారు. ఆయనకు పేదల కష్టాలు తెలుసు. వారి ఇబ్బందులు తెలుసు. అందుకే, దేశ ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు.. ఆ అనుభవాలను ప్రజా విధానంగా మార్చారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు పిలుపునిచ్చారు. ఈ 11 సంవత్సరాలలో, ప్రధాని మోదీ ఎవరూ ఊహించని అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలో భారతదేశానికి కొత్త గుర్తింపును తెచ్చారు. మోదీ అమలు చేసిన 11 విధానాలు.. దేశ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయి. భారత వికాసానికి ఈ 11 ఏళ్లు అమృతకాలంగా నిలిచాయి. ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని పెంచిన ఆ 11 అతిపెద్ద నిర్ణయాల గురించి ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం!

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని మోదీ ఎన్నోసార్లు చెప్పారు. 11 ఏళ్ల మోదీ పాలనలో ఈ విషయం అనేకసార్లు నిరూపితమైంది కూడా! 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా..బాలకోట్ వైమానిక దాడి చేయడం ద్వారా ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరి ప్రపంచానికి అర్థమైంది. భారత్‌లో విధ్వంసానికి కుట్రలు పన్నే ఉగ్రవాదులను.. వారి ఇళ్లలోకి వెళ్లి అంతం చేస్తామన్న సందేశం ఇచ్చింది. ఇది మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఏప్రిల్ 22న, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా..మోదీ సర్కార్‌ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఫలితంగా..పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. మోదీ ప్రభుత్వ 11 సంవత్సరాల ప్రయాణంలో..ఓట్లు, మైనారిటీలు, రాజకీయ లెక్కలు..ఇలా అనేక దశలను చూసింది. కానీ ఈ మారుతున్న పరిస్థితులలో ప్రధాన మంత్రి మోదీ, ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవి! దీనికి అతిపెద్ద ఉదాహరణ జమ్మూ-కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపు.

370 రద్దుపై దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగింది… దీనిపై దేశంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తమైంది. కానీ ఎక్కడా అల్లర్లు జరగలేదు. 370 రద్దు నిర్ణయంపై మోదీ సర్కారు ధృడ నిశ్చయంతో ముందుకెళ్లింది. ప్రధాని మోదీ నిర్ణయం జమ్మూ కాశ్మీర్ ముఖచిత్రాన్ని మార్చేసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో జమ్మూను అనుసంధానించాలనే ఆయన కల నిజమైంది. జమ్మూ-కశ్మీర్‌ అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో రైల్వే కనెక్టివిటీ వేగంగా విస్తరిస్తోంది. ఇందుకు తాజా నిదర్శనం..జమ్మూ-కశ్మీర్లో చినాబ్‌ రైల్వే బ్రిడ్జ్‌తోబాటు, అంజి వంతెనను ప్రధాని జాతికి అంకితం చేయడం! జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తామని చెప్పడమే కాదు..చేసి చూపించారు మోదీ! ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్‌ రైల్వే వంతెనపై వందే భారత్‌ పరుగులు కూడా మొదలయ్యాయి.

ఈరోజు కశ్మీర్‌ లోయలో భారత రైల్వే నెట్‌వర్క్‌ అనుసంధానమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే నెట్‌వర్క్‌ సాకారమైంది. నేడు జమ్మూలోని లక్షలాది మంది ప్రజల కల, కశ్మీరీల కోరిక నెరవేరింది. ఈ ప్రాజెక్ట్ మా పదవీకాలంలో ఊపందుకోవడంతోబాటు మేం ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం! తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు వేగంగా జరగడమే కాకుండా… ఆ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి, ప్రధానమంత్రి మోదీ స్వయంగా సమీక్షలు నిర్వహిస్తారు. దీనికి నిదర్శనం..చినాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జి పూర్తికావడం!

భాను కిరణ్, సీనియర్ జర్నలిస్ట్