India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

|

Aug 08, 2021 | 9:49 AM

Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని రోజుల

India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
India Corona
Follow us on

Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. శుక్రవారం కంటే.. శనివారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగగగా.. మరణాల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మరో 491 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,34,455 కి చేరగా.. మరణాల సంఖ్య 4,27,862 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 43,910 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,99,771 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,06,822 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 50 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటివరకు దేశంలో 50,68,10,492 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 55,91,657 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.



Also Read:

Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అయితే ఉచితంగా 4 లక్షల బెనిఫిట్స్‌.. ఎలాగంటే..!

Constable Suicide: రేణిగుంటలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. డ్యూటీలో ఉండగా గన్‌తో కాల్చుకుని..