దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తే.. మరో రోజు కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మరోసారి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,326 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు మహమ్మారి బారినపడి 260 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,476కి చేరింది. అలాగే మరణాల సంఖ్య 4,46,918కి చేరుకుంది.
నిన్న కరోనా నుంచి 26,032 మంది కోలుకున్నారు. దీనితో ఇప్పటివరకు దేశంలో మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,29,02,351కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,03,476కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొద్ది రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంతలా తగ్గడం గమనార్హం. అటు కేరళలో అయితే మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న 15,768 పాజిటివ్ కేసులు బయటపడగా.. 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85,60,81,527 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 68,42,786 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
India reports 28,326 new COVID cases, 26,032 recoveries, and 260 deaths in the past 24 hours.
Active cases: 3,03,476
Total recoveries: 3,29,02,351
Death toll: 4,46,918Vaccination: 85,60,81,527 (68,42,786 in the last 24 hours) pic.twitter.com/2g3YsGlXnS
— ANI (@ANI) September 26, 2021
కరోనా అప్‌డేట్:
మొత్తం కేసులు: 3,36,52,745
యాక్టివ్ కేసులు: 3,03,476
మొత్తం రికవరీ: 3,29,02,351
మొత్తం మరణాలు: 4,46,918
మొత్తం టీకాలు: 85,60,81,527
ఇవి కూడా చదవండి: AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..
Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..