India Coronavirus: కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో భారీగా పెరిగిన కేసులు, మరణాలు..

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజూవారీ కేసుల

India Coronavirus: కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో భారీగా పెరిగిన కేసులు, మరణాలు..
India Corona Cases
Follow us

|

Updated on: Jan 19, 2022 | 10:24 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్ దాటి రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా నిన్న 2,82,970 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 441 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే.. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 44,889 కేసులు, 131 మరణాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 15,13 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 18,31,000 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 1,88,157 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,55,136,039 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 8,961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 0.79 శాతం పెరిగింది.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 158.50 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 76.35 లక్షల డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Vijay Mallya: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు.. ఇంటి నుంచి బహిష్కరించనున్న స్విస్ బ్యాంకు..

Bihar Woman: నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో వింత శిశువు జననం.. వైద్యుల నిర్లక్ష్యం అంటున్న ఫ్యామిలీ.. చూసేందుకు ఎగబడుతున్న జనం..