- Telugu News Photo Gallery Business photos Tata Motors to hike prices of passenger vehicles from January 19th
Tata Motors: వాహనదారులకు షాకిచ్చిన టాటా మోటర్స్.. ధరలు పెంపు..!
Tata Motors: ప్రస్తుతం వాహనాల ధరలు పెరిగిపోతున్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ధరరలను పెంచేస్తున్నాయి..
Updated on: Jan 19, 2022 | 10:04 AM

Tata Motors: ప్రస్తుతం వాహనాల ధరలు పెరిగిపోతున్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ధరరలను పెంచేస్తున్నాయి. ఇక కొత్త ఏడాదిలో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల ధరలను పెంచేశాయి కంపెనీలు.

ఇక కొత్త ఏడాదిలో ప్యాసింజర్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది టాటా మోటర్స్. తన ప్యాసింజర్ కార్ల ధరలను 1 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

పెంచిన ధరలు జనవరి 19 (ఈరోజు) నుంచి అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగానే ధరలో మరోసారి పెంచాల్సి వచ్చిందని తెలిపింది.

దేశ వ్యాప్తంగా టియాగో, పంచ్ హారియర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈననెల 18 లోపు కార్లను బుకింగ్ చేసుకున్న వారికి ధరల పెంపు ఉండదని తెలిపింది. ఇప్పటికే మారుతి, మహీంద్రా, స్కోడా, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్ వంటి కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచేశాయి.





























