- Telugu News Photo Gallery Business photos Tata Safari Dark Edition launched in a meaner shade of black. Details here
Tata Safari: టాటా సఫారి డార్క్ ఎడిషన్ విడుదల.. అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే..!
Tata Safari:మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ..
Updated on: Jan 18, 2022 | 2:30 PM

Tata Safari:మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా సఫారి డార్క్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు మెకానికల్‌గా యథాతథంగా ఉన్నా కాస్మెటిక్ మార్పులతో పాటు లోపల, వెలుపల బ్లాక్, డార్క్ షేడ్స్‌తో ఆకట్టుకునేలా రూపొందించారు.

డార్క్ ఎడిషన్ ధరలు రూ 19.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. టాటా సఫారి డార్క్ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక డార్క్ ఎడిషన్ ఫీచర్లను చూస్తే..గ్రిల్, హెడ్‌లైట్ పరిసరాలు, విండో పరిసరాలు క్రోమ్ స్థానంలో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్‌తో ఆకట్టుకుంటాయి.

కారు లోపల బ్లాక్‌స్టోన్ డార్క్ థీంతో డిజైన్ చేశారు. డ్యాష్‌బోర్డ్ బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌ను ఇన్‌సర్ట్ చేశారు. 8.8 ఇంచ్ ఇన్ఫోటెయిన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ చార్జర్ కూడా ఉంది.

7 ఇంచ్ సెమి డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైర్, పానోరామిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఆల్ట్రోజ్, నెక్సన్, నెక్సన్ ఈవీ, హారియర్‌లో కూడా టాటా మోటార్స్ డార్క్ రేంజ్ అందుబాటులో ఉంటుంది.





























