India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతుండగా.. 50 కంటే దిగువన మరణాలు సంభవిస్తున్నాయి.

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?

Updated on: Mar 14, 2022 | 9:59 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతుండగా.. 50 కంటే దిగువన మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం దేశవ్యాప్తంగా 2,503 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే.. 20 మేరకు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.47 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 36,168 (0.08%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,24,43,952 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,15,877 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 4,377 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,41,449 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.72 శాతానికిపైగా ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 180.19 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. దేశంలో ఇప్పటివరకు దాదాపు 77.90 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న దేశవ్యాప్తంగా 5,32,232 కరోనా పరీక్షలు చేశారు.

Also Read:

Viral Photo: ఈ ఫొటోలో ముఖ్యమంత్రి ఉన్నారు.. యూత్ ఐకానిక్ ఈయనే.. గుర్తుపడితే మీరు జీనియస్..

Samajwadi Party: యూపీలో పెరిగిన సైకిల్ స్పీడ్.. నాటీ స్థానాల్లో మళ్లీ పాగా వేసిన సమాజ్ వాదీ పార్టీ..