India Covid-19: బిగ్ రిలీఫ్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

|

Feb 26, 2022 | 10:04 AM

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కేసులు భారీగా తుగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో

India Covid-19: బిగ్ రిలీఫ్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కేసులు భారీగా తుగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కేసుల మరింత తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,148 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 255 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,21,881 (0.28%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,05,844 కి పెరగగా.. ఇప్పటివరకు కరోనాతో 5,13,481 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 23,598 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,22,70,482 కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 177.17 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Viral Video: ఈ మొసలి మహాముదురు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

Viral Video: నేనాడితే లోకమే ఆడదా..! బెలూన్‌తో ఆటలాడిన పప్పీ.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు

Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..