Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshadweep: త్వరలో లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం.. భారత్‌ నిర్ణయంతో కంగుతిన్న మాల్దీవుల ప్రభుత్వం

డ్రాగన్‌ కుట్రలో భాగంగా భారత్‌తో కయ్యానికి దిగిన మాల్దీవులకు చుక్కలు కన్పిస్తున్నాయి. మాల్దీవులకు పోటీగా లక్షద్వీవ్‌ను అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌ చేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. త్వరలో అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తారు. అవసరమైతే నైన్‌ డిగ్రీ ఛానెల్‌ను మూసేసి చైనాకు చెక్‌ పెట్టే వ్యూహాన్ని కూడా రెడీ చేస్తున్నారు. భారత్‌ బ్యాన్‌తో టూరిస్టులను తమ దేశానికి పంపించాలని చైనా ప్రభుత్వాన్ని..

Lakshadweep: త్వరలో లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం.. భారత్‌ నిర్ణయంతో కంగుతిన్న మాల్దీవుల ప్రభుత్వం
Lakshadweep
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 09, 2024 | 9:57 PM

న్యూఢిల్లీ, జనవరి 9: డ్రాగన్‌ కుట్రలో భాగంగా భారత్‌తో కయ్యానికి దిగిన మాల్దీవులకు చుక్కలు కన్పిస్తున్నాయి. మాల్దీవులకు పోటీగా లక్షద్వీవ్‌ను అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌ చేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. త్వరలో అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తారు. అవసరమైతే నైన్‌ డిగ్రీ ఛానెల్‌ను మూసేసి చైనాకు చెక్‌ పెట్టే వ్యూహాన్ని కూడా రెడీ చేస్తున్నారు. భారత్‌ బ్యాన్‌తో టూరిస్టులను తమ దేశానికి పంపించాలని చైనా ప్రభుత్వాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు వేడుకున్నారు.

ప్రధాని మోదీని అవమానించిన మాల్దీవుల ప్రభుత్వానికి చుక్కలు కన్పిస్తున్నాయి. బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ నినాదంతో పాటు సరికొత్త ఒత్తిళ్లను భారత్‌ ప్రయోగిస్తోంది. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్‌ను అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రణాళికను సిద్దం చేసింది. త్వరలో లక్షద్వీప్‌ లోని మినీకోయ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్ట్‌ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. వాణిజ్య అవసరాలతో పాటు మిలటరీ అవసరాల కోసం ఈ ఎయిర్‌పోర్ట్‌ను వినియోగించాలని నిర్ణయించారు. ఫైటర్‌ జెట్‌లతో పాటు మిలటరీ కార్గో విమానాలు ల్యాండయ్యేవిధంగా ఈ ఎయిర్‌పోర్ట్‌లో వసతులు కల్పిస్తారు. వాస్తవానికి నేవీకి చెందిన ఎయిర్‌స్ట్రిప్‌ లక్షద్వీప్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్‌ స్థావరాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడి అగత్తి దీవుల్లో మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. మరోవైపు మాల్దీవులను ఉసిగొల్పుతున్న చైనాకు కూడా గుణపాఠం చెప్పేందుకు భారత్‌ రెడీ అవుతోంది. లక్షద్వీప్‌లో ఉన్న నైన్‌ డిగ్రీ ఛానెల్‌ను డ్రాగన్‌ పైకి అస్త్రంగా ప్రయోగించాలని ఆలోచన చేస్తోంది కేంద్రం. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ సముద్రమార్గం మినికోయ్‌ , కాల్పెనీ దీవులను వేరు చేస్తుంది. ఈ మార్గంలో నిముషానికి 11 నౌకలు ప్రయాణం చేస్తాయి.

నైన్‌ డిగ్రీ ఛానెల్‌ను భారత్ మూసేస్తే చైనా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలకు వాణిజ్యం ఆగిపోతుంది. భారత సముద్రజలాల్లో ఈ మార్గం ఉండడంతో ఎన్నో ప్లస్‌పాయింట్లు ఉన్నాయి. చైనాతో యుద్దపరిస్థితులు ఏర్పడితే డ్రాగన్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. భారత్ ఎత్తుగడలను మాల్దీవుల ప్రభుత్వం వెంటనే గమనించింది. ప్రధాని మోదీని అవమానించిన నేతలు ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు. భారత్‌తో విభేదాలను పరిష్కరించుకోవడానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు త్వరలో భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ముయిజ్జు చైనా పర్యటనలో ఉన్నారు. ఫిభ్రవరిలో ఆయన భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.