Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్ వినతి.. మా విద్యార్థుల కోసం సేఫ్ కారిడార్..

|

Mar 05, 2022 | 4:48 PM

Russia Ukraine Tensions: ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కాపాడేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా  రష్యా, ఉక్రెయిన్‌లకు భారత ప్రభుత్వం మరో ప్రత్యేక విజ్ఞప్తి చేసింది.

Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్ వినతి.. మా విద్యార్థుల కోసం సేఫ్ కారిడార్..
Indian Students
Follow us on

Russia Ukraine Tensions: ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కాపాడేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా  రష్యా, ఉక్రెయిన్‌లకు భారత ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు అక్కడి నుంచి బయటపడేందుకు సురక్షితమైన కారిడార్‌ను రూపొందించాలని రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది. ఇందు కోసం ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ విషయంలో ఆ  దేశాలను ఒప్పించేందుకు వివిధ మార్గాల్లో ఆ రెండు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

ఈ విషయంలో తగిన నిర్ణయం వచ్చే వరకు అక్కడ చిక్కుకున్న వారు తమ ఇళ్లలోనే ఉండాలని మరో ట్వీట్‌లో అరిందమ్ బాగ్జి సూచించారు. తమ నివాసాల నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకోవద్దని కోరారు.

ఇదిలా ఉండగా విదేశీ పౌరుల ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు యుద్ధానికి రష్యా తాత్కాలిక విరామం ప్రకటించడం తెలిసిందే. ఉక్రెయిన్‌తో రెండో రౌండ్ చర్చల్లో తీర్మానించిన మేరకు మానవతా దృక్పథంతో ఈ కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ పాటించనున్నట్లు తెలిపింది.

Also Read..

Tamil Nadu Politics: వాడిపోయిన రెండాకులు మళ్లీ చిగురించేనా.. శశికళతో సెల్వం భేటీ దేనికి సంకేతం!

Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే