ఇండియాలోనే ఫస్ట్ టైమ్..అండర్ వాటర్ ట్రైన్
ఇండియన్ రైల్వే మరో ముందడుగు వేసింది. అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. కోల్ కతాలో నిర్మిస్తున్నమొట్టమొదటి అండర్ వాటర్ రైల్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తయింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్రం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశ ప్రజలకే గర్వకారణమని..కోల్ కతా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు. హుబ్లీ నది కింద ఈ ప్రాజెక్టును చేపడుతోంది భారతీయ రైల్వే. సాల్ట్ సెక్టార్ నుంచి హౌరా […]
ఇండియన్ రైల్వే మరో ముందడుగు వేసింది. అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. కోల్ కతాలో నిర్మిస్తున్నమొట్టమొదటి అండర్ వాటర్ రైల్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తయింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్రం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశ ప్రజలకే గర్వకారణమని..కోల్ కతా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు.
హుబ్లీ నది కింద ఈ ప్రాజెక్టును చేపడుతోంది భారతీయ రైల్వే. సాల్ట్ సెక్టార్ నుంచి హౌరా మైదాన్ ను కలుపుతూ 16 కిలోమీటర్ల మార్గం నిర్మించారు. సాల్ట్ లేక్ సెక్టార్-5ను..సాల్ట్ లేక్ స్టేడియానికి అనుసంధానించే ప్రాజెక్ట్ మొదటి దశ త్వరలో అమలులోకి రానుంది. హుబ్లీ నది నీటి ఉధృతిని తట్టుకునేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు.