India Corona Updates: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 18,26,490 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,01,078 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.18 కోట్లకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 4187 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 2,38,270కి చేరుకుంది. ఇక దేశంలో మరణాల రేటు 1.09 శాతం ఉంది.
ఇక కొత్త కేసులతో పాటు రికవరీ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రివకరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా, రివకరీ రేటు 81.95 శాతం ఉంది. ఇక క్రియాశిల కేసులు 37 లక్షలు దాటగా, ప్రస్తుతం 37,23,446 మంది చికిత్స పొందుతున్నారు. ఇక క్రియాశీల రేటు 16.96గా ఉంది. శుక్రవారం ఒక్క రోజు దేశంలో 22,97,257 మందికి కరోనా టీకాలు వేయగా, ఇప్పటి వరకు 16.73 కోట్ల మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.