India Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు.. 10 రెట్ల కంటే ఎక్కువ నమోదు..

దేశంలో కరోనా మరణాల సంఖ్య 10 రెట్లు పెరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్న 374 మరణాలు సంభవించగా.. ఇవాళ ఏకంగా 3998...

India Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు.. 10 రెట్ల కంటే ఎక్కువ నమోదు..
India Corona Updates

Updated on: Jul 21, 2021 | 10:14 AM

దేశంలో కరోనా మరణాల సంఖ్య 10 రెట్లు పెరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్న 374 మరణాలు సంభవించగా.. ఇవాళ ఏకంగా 3998 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోని 3,509 మంది వైరస్‌తో మరణించగా.. మిగిలిన దేశమంతా 489 మరణాలు సంభవించాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,015 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది. ఇందులో 4,07,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 36,977 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,03,90,687కి చేరింది.

అటు నిన్న 3998 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,18,480 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 41,54,72,455 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అన్‌లాక్ కాగా.. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. థర్డ్ వేవ్ టెన్షన్ మొదలు కావడంతో కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తోంది.

Also Read:

మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..

పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!

Follow Us