ఇండియాలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ను బ్యాన్ చేయాల్సిందే..అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ డిమాండ్

ఇండియాలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థను బ్యాన్ చేయాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ డిమాండ్ చేశారు. ఇది ప్రధాని మోదీని అప్రదిష్ట పాల్జేస్తోందని ఆయన ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశంలోని నాయకత్వాన్ని కించపరచేందుకు..

ఇండియాలో  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ను బ్యాన్ చేయాల్సిందే..అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ డిమాండ్
Ban Amnesty International In India Says Assam Cm Himanta Biswa Sharma
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 21, 2021 | 9:12 AM

ఇండియాలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థను బ్యాన్ చేయాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ డిమాండ్ చేశారు. ఇది ప్రధాని మోదీని అప్రదిష్ట పాల్జేస్తోందని ఆయన ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశంలోని నాయకత్వాన్ని కించపరచేందుకు ఈ సంస్థ చాలా కాలంగా కుట్రకు పాల్పడుతోందని ఆయన అన్నారు. దీని కార్యకలాపాలను ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇండియాలో వామ పక్ష తీవ్రవాదాన్ని ఇది ప్రోత్సహిస్తోందని, ఇది అంతర్జాతీయ కుట్ర అని, ఇండియన్ సొసైటీలో అసంతృప్తి బీజాలు నాటేందుకు అన్ని విధాలా యత్నిస్తోందని శర్మ దుయ్యబట్టారు. భారత ప్రభుత్వానికి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు మధ్య ఏడాది కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ చట్ట విరుధ్జంగా విదేశీ నిధులను పొందుతోందని, ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టం కింద వీటిని రిజిస్టర్ చేయడంలేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ సంస్థకు చెందిన రూ. 17.66 కోట్ల చరాస్థులను ఈడీ సీజ్ చేసింది కూడా.

గత ఏడాది సెప్టెంబరులో ఈ సంస్థ కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించి దీని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అయితే ఈ సంస్థ మాత్రం విదేశీ నిధులను రిసీవ్ చేసుకునేందుకు తమకు అంతర్జాతీయ అనుమతులు ఉన్నాయంటూ అడ్డంగా వాదిస్తోంది. భారత ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని. ఇవి నిరాధారమైనవని చెబుతోంది. ప్రభుత్వ ఏజెన్సీలు తమను వేధిస్తున్నాయని కూడా దుయ్యబడుతోంది. ఏమైనా…. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ను బ్యాన్ చేయాలని దేశంలో ఒక ముఖ్యమంత్రి కోరడం ఇదే మొదటి సారి.ఇలా ఉండగా ఈ సంస్థకు చెందిన ఇతర చరాస్థులను కూడా ఎటాచ్ చేసేందుకు ఈడీ అధికారులు యత్నిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : Rains In Hyderabad Video: చినుకుతో భాగ్యనగరం వణుకు..!మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..(వీడియో).

 Bigg Boss 5 Video: 100% గ్లామర్… బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్ లిస్ట్ లీక్..ఈ సరి మరింత ఆసక్తికరంగా…

 మోదీ ఫొటోకు వంగి వంగి దణ్ణాలు పెడుతున్నారు.ఎందుకో..?ఎక్కడో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో..:Punch to PM Modi video.

 Gold Price video: మరోసారి పసిడి పరుగులు..మళ్ళి పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇలా.. (వీడియో)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu