India-China Troops Clash: భారత్-చైనాల మధ్య గాల్వాన్ రిపీట్.. అరుణాచల్ సరిహద్దు లోని తవాంగ్ దగ్గర ఘర్షణ.. 30 మంది సైనికులకు గాయాలు..
భారత్-చైనాల మధ్య గాల్వాన్ ఘటన రిపీట్ అయ్యింది. తాజాగా.. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద భారత్- చైనా సైనికులు కొద్దిసేపు ఘర్షణ పడ్డారు. ఇరు పక్షాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి.
భారత్-చైనా మధ్య గాల్వాన్ సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. ఈసారి అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో చైనా సైన్యం కవ్వింపులకు పాల్పడింది. తవాంగ్ సెక్టార్ లో భారత భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. దీంతో ఇరు దేశాలకు చెందిన సైనికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 30 మంది సైనికులు గాయపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన ఈ ఘటన జరిగినట్టు భారత సైన్యం ధృవీకరించింది. గాయపడ్డ భారత సైనికులను అసోం రాజధాని గౌహతికి తరలించారు. గౌహతి ఆర్మీ ఆస్పత్రిలో భారతీయ సైనికులకు చికిత్స జరుగుతోంది. ఘర్షణ జరిగిన సమయంలో 500 మంది సైనికులు అక్కడ ఉన్నారు. డిసెంబర్ 9వ తేదీతో పాటు ఆదివారం కూడా ఇరుదేశాల సైనికుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో కొంతమంది సైనికులు కాళ్లు , చేతులు విరిగాయి.
తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణ తరువాత రెండు దేశాలు శాంతి నెలకొల్పే చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా భారత్ -చైనా సైనిక కమాండర్ల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం తరువాత రెండు దేశాలకు చెందిన సైనికులు వెనక్కి తగ్గారు.
On 9th Dec 2022, PLA troops contacted the LAC in Tawang Sector of Arunachal Pradesh which was contested by Indian troops in a firm and resolute manner. This face-off led to minor injuries to a few personnel from both sides. Both sides immediately disengaged from the area: Sources pic.twitter.com/vQLXcM3xLS
— ANI (@ANI) December 12, 2022
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్‌లో భారత సైన్యం చాలా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది. చైనా సరిహద్దు వరకు రైల్వే నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే భారత సైన్యం ఈ ప్రాంతంలో వంతెనను కూడా నిర్మించింది. ఈ అభివృద్ధి పనులను చైనా సైన్యం జీర్ణించుకోలేకపోతోంది. భారత సైన్యాన్ని కవ్విస్తోంది.
LAC దగ్గర చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించడంతో భారత సైన్యం అడ్డుకుంది. తూర్పు లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణల తరువాత ఇరుదేశాల సైనికులు గొడవపడడం ఇదే తొలిసారి. 2020లో గాల్వాన్ లోయలో ఇరుదేశాలకు చెందిన సైనికులు గొడవ పడ్డారు. భారత్-చైనా సరిహద్దులో మరోసారి నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎటు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం