ఏంటీ.. మనం పాకిస్థాన్ నుంచి ఇన్ని రకాల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నామా? ఇప్పుడు అన్ని ఆగిపోతాయ్..
పహల్గామ్ దాడి తరువాత, భారతదేశం పాకిస్థాన్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలను తెంచుకుంటూ, పాకిస్థాన్ నుండి అన్ని రకాల దిగుమతులను నిషేధించింది. ఇందులో హిమాలయన్ రాక్ సాల్ట్, డ్రై ఫ్రూట్స్, పెషావరి చప్పల్, లాహోరి దుస్తులు వంటి ప్రజాదరణ పొందిన వస్తువులు ఉన్నాయి.

పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌పై పలు చర్యలు తీసుకుంది. తాజాగా పాకిస్థాన్ నుంచి ఇండియాకు దిగుమతి అయ్యే ప్రతి వస్తువును నిషేధించింది. పాకిస్తాన్ నుండి వచ్చే వాటిపై పూర్తి నిషేధం విధించింది. ప్రత్యక్ష దిగుమతి అయినా లేదా థర్డ్ పార్టీ దిగుమతి అయినా కూడా.. పాక్‌తో లింక్ అయి ఉన్న ఏ వస్తువును కూడా ఇండియాలోకి దిగుమతి కాదు. అయితే ఈ నిషేధం విధించే కంటే ముందు అసలు పాకిస్థాన్ నుంచి ఇండియాలోకి ఏఏ వస్తువులు, ఉత్పత్తులు దిగుమతి అయ్యేవో చూద్దాం..
సేంద నమక్ (హిమాలయన్ రాక్ సాల్ట్)
ఇండియా ఉపవాసం, ఆయుర్వేద ప్రయోజనాల కోసం ఉపయోగించే రాక్ సాల్ట్ (రాతి ఉప్పు) వాస్తవానికి పాకిస్తాన్‌లోని ఖేవ్రా గనుల నుండి వస్తుంది. దీనిని హిమాలయన్ రాక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. భారతదేశానికి భారీ పరిమాణంలో దిగుమతి చేసుకునే అత్యంత ప్రముఖమైన పాకిస్తాన్ ఉత్పత్తులలో ఇది ఒకటి.
డ్రై ఫ్రూట్స్
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, పెషావర్ ప్రాంతాల నుండి బాదం, వాల్‌నట్, ఎండుద్రాక్ష, అంజూర వంటి డ్రై ఫ్రూట్స్ ఇండియా దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా పండుగలు, శీతాకాలాలలో వాటి డిమాండ్ ఎక్కువ.
పెషావరి చప్పల్
మన్నిక, సాంప్రదాయ రూపకల్పనకు ప్రసిద్ధి చెందిన పెషావరి చప్పల్(చెప్పులు) ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రజాదరణ పొందాయి. ఇవి ముఖ్యంగా పురుషుల సాంప్రదాయ దుస్తులలో ఒక భాగంగా ధరిస్తారు.
లాహోరి కుర్తాలు, దుస్తులు
లాహోర్ ప్రసిద్ధ ఎంబ్రాయిడరీ డిజైన్లతో కూడిన కుర్తాలు, సల్వార్-సూట్లు, ఇతర వస్త్రాలు భారతదేశంలో ప్రజాదరణ పొందాయి. అనేక ఫ్యాషన్ బ్రాండ్లు ఈ కుర్తాలను ప్రత్యేకమైన డిజైన్లుగా ప్రచారం చేసేవి. వీటిని కూడా పాకిస్థాన్ ఎక్కువగా ఇండిమాకు ఎగుమతి చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
