Independence Day: ఎత్తైన మంచు కొండల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. ఏయే రాష్ట్రాల్లో అంటే..

ఎత్తైన కొండల్లో తీవ్రమైప చలిలో.. ఐటీబీపీ జవాన్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాండించారు. లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు ఒడ్డున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ITBP జవాన్లు నిర్వహించారు.

Independence Day: ఎత్తైన మంచు కొండల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. ఏయే రాష్ట్రాల్లో అంటే..
Itbp

Updated on: Aug 15, 2022 | 7:34 AM

Independence Day:దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటితో 75 సంవత్సరాలు పూర్తిచేసుకుని..76వ వసంతంలోకి అడుగుపెట్టాం. ఈసందర్భంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న చిన్న పల్లెలు మొదలు పెట్టి, పట్టణాలు, నగరాల్లో గర్వంగా ప్రతి భారతీయుడు జాతీయ జెండాను ఎగరవేసి.. జైహింద్ కొడుతున్నాడు. పాఠశాలలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో జెండా వందనం చేస్తున్నారు.

మరోవైపు ఎత్తైన కొండల్లో తీవ్రమైప చలిలో.. ఐటీబీపీ జవాన్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాండించారు. లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు ఒడ్డున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ITBP జవాన్లు నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఉత్తరఖండ్ లో ITBP జవాన్లు 17,500 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. సిక్కింలో 18,800 అడుగుల ఎత్తులో ITBP జవాన్లు జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో ఎత్తైన ప్రాంతాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎత్తైన కొండల్లో భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించారు. ఇలా దేశ వ్యాప్తంగా ITBP జవాన్లు 76వ స్వాతంత్య్ర దినోవ్సవ వేడుకలను జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..