Independence Day: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత..మన దేశం ఎలా జరుపుకుంటుందంటే..!

|

Aug 08, 2024 | 8:02 AM

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులును వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతేకాదు ఆసేతు హిమాచలం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల థీమ్, ప్రాముఖ్యత, హిస్టరీ గురించి తెలుసుకుందాం..

Independence Day: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత..మన దేశం ఎలా జరుపుకుంటుందంటే..!
Independence Day
Follow us on

భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగష్టు 15, 2024 గురువారం జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 15న జరుపుకుంటారు. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటీష్ వారి పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజుకి గుర్తుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1947లో ఆగస్టు 15న జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులును వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతేకాదు ఆసేతు హిమాచలం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల థీమ్, ప్రాముఖ్యత, హిస్టరీ గురించి తెలుసుకుందాం..

స్వాతంత్ర్య దినోత్సవం 2024 థీమ్

భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ‘విక్షిత్ భారత్’పై దృష్టి సారించి .. ఈ వేడుకలను జరుపుకోనుంది. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం థీమ్ స్వాతంత్య్ర శతాబ్దిని గుర్తుచేసుకుంటూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణం గురించి చెబుతుంది.

స్వాతంత్ర్య కోసం పోరాటంలో ప్రధాన ఘట్టాలు

  1. 1600ల ప్రారంభంలో వాణిజ్య ప్రయోజనాల కోసం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది. అయితే క్రమంగా భారత ఉపఖండంలోని రాజుల మధ్య ఉన్న అనైక్యత అనుకూలంగా మార్చుకుని బ్రిటిష్ వారు భారత దేశంలో తన ప్రభావాన్ని ..నియంత్రణను విస్తరించింది.
  2. 1757లో ప్లాసీ యుద్ధం తరువాత ఈ బ్రిటిష్ కంపెనీ తన పాలనను పెంచుకోవడం మొదలు పెట్టింది. మన దేశంలో అపార సంపదను గుర్తించి విస్తృతమైన దోపిడీ చేసింది. భారతీయులను బానిసలుగా భావించి అణచివేతకు గురి చేశారు.
  3. 19వ శతాబ్దం మధ్య నాటికి బ్రిటీష్ క్రౌన్ మన దేశాన్ని నియంత్రణకు తీసుకుని ప్రత్యక్ష పాలన మొదలు పెట్టింది. 1857 తిరుగుబాటు తర్వాత 1858లో అధికారికంగా బ్రిటిష్ రాజ్యాన్ని స్థాపించింది, అయితే 1857 తిరుగుబాటుని భారత స్వాతంత్ర్య మొదటి యుద్ధం అని కూడా పిలుస్తారు.
  4. జూలై 4, 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కలోనియల్స్‌లో భారత స్వాతంత్ర్య బిల్లు ప్రవేశపెట్టబడింది. 200 ఏళ్ల తర్వాత 1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ ఆధిపత్యం ముగిసింది.
  5. బ్రిటీష్ వారు జూలై 18, 1947 న భారత స్వాతంత్ర్య చట్టాన్ని రూపొందించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం పీక్ స్టేజ్ చేరుకోవడంతో బ్రిటిష్ వారు అఖండ భారతాన్ని ముక్కలు చేసి స్వాతంత్ర్యం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.
  6. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ , ముహమ్మద్ అలీ జిన్నాతో సహా బ్రిటిష్ ప్రభుత్వం, భారత నాయకుల మధ్య చర్చలు దేశాన్ని రెండు వేర్వేరు దేశాలుగా విభజించాలనే నిర్ణయానికి దారితీశాయి.
  7. ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం కోసం జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ డిమాండ్లను పరిష్కరించడం దీని లక్ష్యం.
  8. ఆగష్టు 15, 1947 న భారతదేశం అధికారికంగా స్వాతంత్ర్యం పొందింది.

భారత జాతీయ జెండాను ఎగురవేయడం

స్వతంత్ర భారతదేశం మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం ద్వారా అధికార బదిలీ గుర్తించబడింది, దీనిని “ట్రైస్ట్ విత్ డెస్టినీ” ప్రసంగం అని పిలుస్తారు. ఈ రోజు కూడా ఉపఖండం భారతదేశం, పాకిస్తాన్‌లుగా విభజించబడింది. ఈ సంఘటన దేశంలో గణనీయమైన జనాభా మార్పులు, మత హింసకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యత

  1. స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘమైన, కష్టతరమైన పోరాటం ముగింపును స్మరించుకుంటూ దేశం కోసం ప్రాణాలను సైతం త్యంగా చేసిన వ్యక్తులను తలచుకుని నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం ఆగష్టు 15వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు.
  2. భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. న్యాయం, స్వేచ్ఛ సూత్రాల అవిష్కతను నొక్కి చెబుతూ “ప్రజల, ప్రజలచే, ప్రజల కోసం” ప్రభుత్వం ఏర్పాటుకి పునాది వేసింది.
  3. స్వాతంత్ర్య దినోత్సవం అనేది భారతదేశం గత పోరాటాలను గౌరవించే బహుముఖ వేడుక. గత విజయాలను గుర్తు చేసుకుంటుంది. భవిష్యత్తు ఆకాంక్షల కోసం ఎదురుచూస్తుంది. జాతీయ స్వేచ్చ, ఐక్యతకు ప్రతిబింబం. స్వేచ్ఛ స్ఫూర్తిని గుర్తు చేస్తూ.. పౌరులందరికీ మెరుగైన దేశాన్ని నిర్మించడానికి కొనసాగుతున్న తపనను ప్రతిబింబించే రోజు.

భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటుంది

  1. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రాథమిక కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. గత సంవత్సరంలో సాధించిన విజయాలను తెలియజేస్తూ.. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
  2. ఆగస్టు 15 జాతీయ సెలవుదినం అయినప్పటికీ దేశవ్యాప్తంగా అనేక రకాల దేశభక్తి , సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలు అధికారికంగా, పబ్లిక్‌గా ఉంటాయి. ఇందులో వివిధ వేడుకలు, ఈవెంట్‌లు, జాతీయ విధానాలను తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి.
  3. ప్రధాని ప్రసంగం అయిన తర్వాత భారతదేశ సైనిక సామర్థ్యాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే కవాతుతో పాటు పాఠశాల పిల్లల ప్రదర్శనలు, వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే పట్టికలు, సాయుధ దళాల ప్రదర్శనలను నిర్వహిస్తారు.
  4. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రత్యేక సెమినార్లు నిర్వహిస్తారు. ఇది జాతీయ పండగ రోజు… భారతీయులు తమ చరిత్రను స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించటానికి, దేశం సాధించిన విజయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..