Independence Day 2024: దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని మోదీ

| Edited By: Rajeev Rayala

Aug 15, 2024 | 7:20 AM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు

Independence Day 2024: దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని మోదీ
Independence Day 2024
Follow us on

78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంతకుముందు ఈ ఘనతను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సాధించారు. నెహ్రూ దేశ మొదటి ప్రధానమంత్రిగా వరుసగా 11 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు కాగా.. యువజన విభాగం నుంచి 600 మంది, మహిళా శిశు అభివృద్ధి నుంచి 300 మంది అతిథులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 300 మంది, గిరిజన శాఖ నుంచి 350 మంది అతిథులు హాజరుకానున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు.

గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఎర్రకోట ప్రాకారం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.  మూడవ సారి ప్రధాన మంత్రిగా పదవిని చేపట్టిన ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోటపై జెండా ఎగురవేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను దాటి  దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత ప్రధాని మోదీ మూడో స్థానానికి చేరుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై నుంచి 10 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..