యూపీలో జరిగే హింసాత్మక ఘటనలను ఇక ‘మాస్టర్ స్ట్రోక్’ అని పిలవాల్సిందేనని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అన్నారు. అంటే ఇవి ఓ పథకం ప్రకారం జరిగే నేరాలని వారు బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇటీవల ముగిసిన బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో ఓ మహిళ పట్ల అసభ్య పవర్తనను, పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘర్షణలను వీరు ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో ఓ మహిళ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా ‘ఆమె చీరను లాగివేసి కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. ఇది బీజేపీ హద్దులు దాటుతోందనడానికి నిదర్శనమని రాహుల్ పేర్కొన్నారు. అంటే ఆమెను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడానికేనని తెలుస్తోందన్నారు. కొన్నేళ్ల క్రితం ఓ రేప్ బాధితురాలు బీజేపీ ఎమ్మెల్యే ఒకరిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోగా ఆమెను, ఆమె కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నం జరిగిందని ఇప్పుడు అదే తరహా బిహేవియర్ ని చూస్తున్నామని ఆయన అన్నారు. లఖింపూర్ ఖేరిలో ఈ నెల 8 న సమాజ్ వాదీ పార్టీకి చెందిన మహిళ మీద జరిగిన దాడిని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు.
బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్నవారు ఆమె పట్ల హేయంగా ప్రవర్తించారని, మహిళలు, జర్నలిస్టుల పట్ల యూపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కాగా లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ నెల 8 న ఈ ప్రాంతంలోనే కాక సుమారు డజను ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని, చివరకు ఈ బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ విధమైన ఘటనలు జరగడం ఆశ్చర్యకరంగా ఉందని యూపీ పోలీసులు అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.