AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెడ గుండా మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత

బాలుడు ఆడుకుంటుండగా కిందపడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మేకు అతని మెదడు గుండా బ్రెయిన్‌లోకి మేకు దూసుకెళ్లింది. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అక్కడి డాక్టర్లు పరిస్థితిని అర్థం చేసుకుని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. కేసు సంక్లిష్టంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు సైతం.. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తీసుకెళ్లాలని సూచించారు.

Viral: ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెడ గుండా మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత
Iron Nail Inside Brain
Ram Naramaneni
|

Updated on: May 30, 2025 | 7:11 AM

Share

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి, 7 ఏళ్ల బాలుడి మెదడులోకి మెడ ద్వారా వెళ్లిన 8 సెంటీమీటర్ల ఇనుప మేకును తొలగించారు. ఈ శస్త్రచికిత్స దాదాపు 10 గంటలపాటు సాగింది.

బాలుడు ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపుర్ జిల్లాలోని నవాజ్‌పుర్ గ్రామానికి చెందినవాడు. మే 15న ఆడుకుంటున్నప్పుడు కిందపడిపోయి, మెడలోకి మేకు దూసుకెళ్లింది. అది మెదడుకు వెళ్లి అక్కడే కూరుకుపోయింది. కుటుంబ సభ్యులు మొదట అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై బలరాంపుర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి అతడిని లక్నోలోని KGMU ట్రామా సెంటర్‌కు తరలించారు.

అక్కడ డాక్టర్ సమర్, డాక్టర్ అశుతోష్ మే 16న తెల్లవారుజామున 1 గంటకు బాలుడిని పరిశీలించారు.  మేకు మెదడులోకి వెళ్లి, రక్తనాళాలను డ్యామేజ్ చేయలేదని గుర్తించారు. ఈ కేసు చాలా క్లిష్టమైనదని, బాలుడి ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయని వారికి అర్థమైంది. న్యూరోసర్జరీ, ENT నిపుణులతో కలిసి సమావేశమై శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ రాత్రే 10 గంటల సమయంలో సర్జరీ మొదలుపెట్టారు. ఈ చికిత్సలో డాక్టర్ వైభవ్ జైస్వాల్, డాక్టర్ సమీర్ మిశ్రా, డాక్టర్ యాదువేంద్ర, డాక్టర్ లోకేశ్, డాక్టర్ ఏక్తా తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉండి వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ శస్త్రచికిత్స విజయవంతమవడం వైద్య రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని వైద్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..