NIA – Dawood Ibrahim: దావూద్‌కూ ఊహించని ఝలక్ ఇచ్చిన ‘ఎన్ఐఏ’.. వారందరికీ ఏకకాలంలో..

|

May 10, 2022 | 8:19 AM

NIA - Dawood Ibrahim: అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ గ్యాంగ్‌ కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో హవాలా వ్యాపారం చేస్తున్న..

NIA - Dawood Ibrahim: దావూద్‌కూ ఊహించని ఝలక్ ఇచ్చిన ‘ఎన్ఐఏ’.. వారందరికీ ఏకకాలంలో..
Nia
Follow us on

NIA – Dawood Ibrahim: అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ గ్యాంగ్‌ కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో హవాలా వ్యాపారం చేస్తున్న దావూద్‌ అనుచరులను అరెస్ట్‌ చేసింది. మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీమ్‌కు చెందిన సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులపై ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు చేసింది. హవాలా వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో- నాగ్‌పడా, గోరేగావ్‌, బోరివాలీ, శాంతాక్రజ్‌, భేండీ బజార్‌ వంటి 20 చోట్ల సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. అలాగే హాజీ అలీ దర్గా, మొహిమ్‌ దర్గా ట్రస్ట్‌ అయిన సొహాయిల్‌ ఖండ్వానీ ఇంటిపై కూడా దాడిచేసింది. ఈ దాడుల్లో గుడ్డ పఠాన్‌ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

దావూద్‌కి అత్యంత సన్నిహిత సహాయకుడిగా గుడ్డు పఠాన్‌కు పేరుంది. ముంబైలో నివాసముంటున్న దావూద్ ఇబ్రహిం సహాయకుల నివాసాల్లో ఎన్‌ఐఏ సోమవారం విస్తృత సోదాలు నిర్వహించింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ వివరించింది. దావూద్‌ అనుచరులను ఇంటరాగేషన్ చేస్తునట్టు తెలిపింది. కాగా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్‌కు సన్నిహితుడైన సలీం ఖురేషీ అలియాస్ సలీం ఫ్రూట్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ముంబైలోని హజీ అలీ దర్గాకు చెందిన ఒక ట్రస్టీని కూడా అరెస్ట్ చేసింది. ముంబైతోపాటు పుణెలోని 20 చోట్ల సోమవారం దర్యాప్తు జరిపామని, అనంతరం వీరిని అరెస్ట్ చేశామని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

కాగా ఛోటా షకీల్ మరదలి భర్తే సలీం ఖురేషీ. దక్షిణ ముంబైలోని అతడి నివాసం భెండీ బజార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ వివరించింది. దావూద్‌ గ్యాంగ్‌ నెట్‌వర్క్‌ను మళ్లీ విస్తరించడానికి ఈ ముఠా ప్రయత్నిస్తునట్టు సమాచారం ఉంది. చాలా రోజుల నుంచి దావూద్‌ అనుచరులపై నిఘా పెట్టిన ఎన్‌ఐఏ ఒకేసారి దాడులు నిర్వహించింది. పాక్‌ ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌తో కూడా వీళ్లకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఈ ముఠాతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్లను కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు.