మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయి..! ముంబై పోలీస్‌ హెల్ప్‌ లైన్‌కి బెదిరింపు కాల్‌తో హై అలర్ట్‌

|

Oct 19, 2022 | 8:37 PM

మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని చెప్పాడు. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 112కు కాల్‌ చేసిన వ్యక్తి..

మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయి..! ముంబై పోలీస్‌ హెల్ప్‌ లైన్‌కి బెదిరింపు కాల్‌తో హై అలర్ట్‌
Mumbai Police
Follow us on

ముంబై బాంబు పేలుడు బెదిరింపు కాల్: ముంబైలోని పలు కీలక ప్రదేశాలలో బాంబు పేలుళ్లు జరుగుతాయని ముంబై పోలీసులకు బుధవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోలీస్‌ స్టేషన్‌ హెల్ప్‌లైన్ నంబర్ 112కి ఫోన్ కాల్ చేసిన వ్యక్తి..ముంబైలో మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని చెప్పాడు. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 112కు కాల్‌ చేసిన వ్యక్తి ముంబైలో మూడు బాంబు పేలుళ్లు జరుగుతాయని బాంబు పేల్చాడు. తదుపరి చర్య తీసుకోవడానికి కాల్ చేసిన వ్యక్తిని గుర్తించడానికి భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

ముంబైలోని ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు జరుగుతుందని కాల్ చేసిన వ్యక్తి ఫోన్‌లో పేర్కొన్నాడు. కాల్ అందుకున్న వెంటనే, భద్రతను పెంచారు పోలీసు యంత్రాంగం. బాంబు హెచ్చరికలతో సహార ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు, జుహు, అంబోలి, బంగూర్‌ నగర్‌ పోలీసులతో పాటు సీఐఎస్‌ఎఫ్‌, బీడీడీఎస్‌ బలగాలను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఫోన్‌ కాల్‌పై దర్యాప్తు చేపట్టారు. పోలీస్ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కి కాల్‌ చేసిన వ్యక్తి ఎవరనేది గుర్తించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి