మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్య నిషేధం విధించాలంటూ ట్వీట్..!

బీజేపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ ఉమా భారతి వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

  • Balaraju Goud
  • Publish Date - 8:01 pm, Fri, 22 January 21
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్య నిషేధం విధించాలంటూ ట్వీట్..!

Uma Bharti appeal to JP Nadda : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ ఉమా భారతి వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మారాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో మద్యంపై నిషేధం విధించాలని ఉమా భారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను పెంచే ప్రతిపాదనపై వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఉమా భారతి ఎనిమిది వరుస ట్వీట్లతో ఈ అభ్యర్థన చేశారు. జేడీ (యూ) చీఫ్ నితీష్ కుమార్ ఉదాహరణను చూపుతూ, బీహార్ సీఎం వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధించడం వెనుక మద్యపాన నిషేధం అమలు వల్ల మహిళా ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలచుకున్నారని ఉమా భారతి గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య పెంచకుండా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్రకటన ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాల వెనుక మద్యపానం ప్రధాన కారణమని ఉమాభారతి చెప్పారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో మద్య నిషేధానికి సిద్ధం కావాలని ఈ ట్వీట్ ద్వారా నా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఉమా భారతి చెప్పారు. మద్య నిషేధం విధించడం వల్ల కోల్పోయే రాష్ట్ర ఆదాయాన్ని ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవచ్చని ఉమా భారతి సూచించారు.

Read Also.. SC rejects: సుప్రీంకోర్టుకు చేరిన ఆంధ్రప్రదేశ్ లోకల్ ‘పంచాయితీ’.. హౌజ్ మోషన్ తిరస్కరించిన కోర్టు..