Biparjoy Cyclone: దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను.. గుజరాత్‌లో హై అలర్ట్

|

Jun 13, 2023 | 2:55 PM

అరేబియ మహాసముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాల్చుతోంది. గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైంది. దీంతో అధికారులు సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Biparjoy Cyclone: దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను.. గుజరాత్‌లో హై అలర్ట్
Biparjoy
Follow us on

అరేబియ మహాసముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాల్చుతోంది. గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైంది. దీంతో అధికారులు సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పోరుబంద‌ర్‌తో పాటు ద్వార‌క జిల్లాల్లో గాలి వేగం పుంజుకుంటున్నట్లు ఐఎండీ డైర‌క్టర్ జ‌న‌ర‌ల్ డాక్టర్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. ఆ జిల్లాల్లో గాలి వేగం గంట‌కు 75 కిలోమీట‌ర్లు ఉన్నట్లు చెప్పారు. గుజ‌రాత్‌లోని క‌చ్ ప్రాంతంతో పాటు పాకిస్థాన్‌లోని క‌రాచీ తీర ప్రాంతం మ‌ధ్య బిప‌ర్‌జాయ్ తుఫాన్ జూన్ 15న తీరం దాటే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంట ఉన్న సుమారు 8 వేల మందిని అధికారులు ఇప్పటికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

క‌చ్‌, జామ్‌న‌గ‌ర్‌, మోర్బీ,రాజ్‌కోట్, గిర్ సోమ‌నాథ్‌, పోరుబంద‌ర్‌, ద్వారక, జునాగఢ్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గాలి వేగం కూడా శ‌క్తివంతంగా మారే ఛాన్సు ఉన్నట్లు పేర్కొంది. జూన్ 15న దాదాపు 150 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశాలు ఉన్నట్లు చెప్పింది. కచ్, జమ్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పింది. అరేబీయ మహా సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే వెళ్లినవారు తిరిగిరావాలని ఆదేశించారు. అలలు 2-3 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 6 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే గుజరాత్‌లో ఈ నెల 15 వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..