మరో 15 రోజుల్లో టెలిఫోన్ నెట్‌వర్క్ సౌకర్యం.. గవర్నర్ సత్యాపాల్

| Edited By:

Aug 26, 2019 | 3:11 AM

జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. 70 ఏళ్ల తర్వాత జరుగుతున్న మార్పులను కశ్మీర్ ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు గవర్నర్. మరో 10 నుంచి 15 రోజుల్లో కశ్మీర్‌లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇక్కడ పరిస్థితులు కుదుటపడేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు […]

మరో 15 రోజుల్లో టెలిఫోన్ నెట్‌వర్క్ సౌకర్యం.. గవర్నర్ సత్యాపాల్
Follow us on

జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. 70 ఏళ్ల తర్వాత జరుగుతున్న మార్పులను కశ్మీర్ ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు గవర్నర్. మరో 10 నుంచి 15 రోజుల్లో కశ్మీర్‌లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇక్కడ పరిస్థితులు కుదుటపడేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు గవర్నర్ సత్యపాల్. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మానుకోవాలని, ఇక్కడి ప్రజల్ని రెచ్చగొట్టవద్దంటూ హితవు పలికారు.