Nipah virus: కేరళ సహా తొమ్మిది రాష్ట్రాల గబ్బిలాలలో నిపా వైరస్‌.. ICMR షాకింగ్‌ అధ్యయనం..

|

Jul 27, 2023 | 4:01 PM

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గబ్బిలాలలో నిపా వైరస్ వ్యాపించినట్లు రుజువైంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే పూర్తయింది.

Nipah virus: కేరళ సహా తొమ్మిది రాష్ట్రాల గబ్బిలాలలో నిపా వైరస్‌.. ICMR షాకింగ్‌ అధ్యయనం..
Nipah Virus
Follow us on

తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని గబ్బిలాలలో నిపా వైరస్ వ్యాప్తికి ఆధారాలు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. నిపా వైరస్ గుర్తించిన ప్రాంతాలతో పాటు తెలంగాణ, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, చండీగఢ్‌లలో పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గబ్బిలాలలో నిపా వైరస్ వ్యాపించినట్లు రుజువైంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే పూర్తయింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో నిపా వైరస్ యాంటీబాడీలు గబ్బిలాలలో కనిపించాయని, గ్రూప్ లీడర్, మాగ్జిమమ్ కంటైన్‌మెంట్ లాబొరేటరీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ తెలిపారు.

నిపా వైరస్ గుర్తించిన ప్రాంతాలతో పాటు తెలంగాణ, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, చండీగఢ్‌లలో పరీక్షలు నిర్వహించారు. నిపా వైరస్ మానవులలో ప్రాణాంతక శ్వాసకోశ, మెదడు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ICMR స్పష్టం చేసింది.

గబ్బిలాలు టెరోపస్ జాతి వైరస్ వాహకాలు. మహమ్మారి సంభావ్యత కలిగిన వ్యాధికారక క్రిములలో ఇది ఒకటి. నిపా కేసుల్లో మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2018-19లో కేరళలో నిపా వెలుగులోకి వచ్చినప్పటి నుండి నిరంతర నిఘాను పెంచింది.

ఇవి కూడా చదవండి

గతంలో అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో గబ్బిలాలలో నిపా వైరస్ ఉన్నట్లు ICMR-NIV గుర్తించింది. పశ్చిమ బెంగాల్‌లోని మయానాగురి, కూచ్‌బెహార్‌ ప్రాంతాలు, కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో వైరస్‌ ఉనికిని గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..