బీహార్ లో సుధీర్ కుమార్ అనే ఓ ఐఏఎస్ అధికారి సీఎం నితీష్ కుమార్ పైన, మరో 21 మంది అధికారులపైన ఫోర్జరీ కంప్లయింట్ దాఖలు చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం రెవెన్యు బోర్డులో సభ్యుడైన ఈయన..1987 నాటి బ్యాచ్ అధికారి. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ స్కామ్ లో నిందితుడై మూడేళ్ళ జైలుశిక్ష అనుభవించి బెయిలుపై విడుదలయ్యాడు.నాడు బీహార్ లో ఈ స్కామ్ దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కింది. సుధీర్ కుమార్ నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పాట్నాలోని గార్దానీ బాగ్ పోలీసు స్టేషనుకు వెళ్లి అక్కడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి 35 పేజీలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని ఇచ్చాడు. ఇందులో సీఎం నితీష్ కుమార్ పేరును చూడగానే ఆ అధికారి ఈ పత్రాలతో సహా బయటికి వెళ్లిపోయాడని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడని సుధీర్ కుమార్ తెలిపాడు. ఓ ఐఏఎస్ అధికారిని మూడు గంటలపైగా వెయిట్ చేయించిన ఈ పోలీసు అధికారిని ఏమనాలి..? ఇలా ఉంది రాష్ట్రంలో పాలన అన్నాడు ఆయన.
అసలు పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయ;లేదని, సింపుల్ గా తన కంప్లైంట్ అందినట్టు ఓ రసీదు ఇచ్చారని ఆయన తెలిపాడు. అటు- ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం తదనంతర చర్యలు తీసుకుంటామని పాట్నా ఎస్పీ ఉపేంద్ర శర్మ చెప్పారు. బీహార్ విపక్ష నేత ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ఒక సందర్బంలో సీఎం నితీష్ కుమార్ పై ఫోర్జరీ కేసు ఉందని ప్రస్తావించారు. అయితే నితీష్ కుమార్ ఈ ఆరోపణలను తేలిగ్గా కొట్టి పారేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.
పెంపుడు కుక్కలకు ఆమె తొలి పరిచయం.. బిత్తరపోయిన మొహాలు చూసుకున్న శునకాలు వీడియో..:Pet Dog Video.