AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SI Beating Woman: మహిళను కింద పడేసి దారుణంగా కొట్టిన ఎస్‌ఐ.. దుమారం రేపుతున్న వీడియో..

SI Beating Woman - Viral Video: మహిళ అని చూడకుండా.. ఓ ఎస్సై దారుణంగా ప్రవర్తించాడు. ఆ మ‌హిళ‌ను కింద ప‌డేసి.. ఆమెపై కూర్చొని దారుణంగా కొట్టాడు. ఈ అమానవీయ

SI Beating Woman: మహిళను కింద పడేసి దారుణంగా కొట్టిన ఎస్‌ఐ.. దుమారం రేపుతున్న వీడియో..
Cop Beating Woman
Shaik Madar Saheb
|

Updated on: Jul 18, 2021 | 1:37 PM

Share

SI Beating Woman – Viral Video: మహిళ అని చూడకుండా.. ఓ ఎస్సై దారుణంగా ప్రవర్తించాడు. ఆ మ‌హిళ‌ను కింద ప‌డేసి.. ఆమెపై కూర్చొని దారుణంగా కొట్టాడు. ఈ అమానవీయ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని కాన్పూర్‌ డెహత్‌ జిల్లా దుర్గాదాస్‌పూర్‌ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన‌ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దుర్గాదస్‌పూర్‌లో ఇటీవ‌ల ఓ వ్యక్తిని భోగిన్‌పూర్‌ ఎస్సై మహేంద్ర పటేల్ అరెస్టు చేశాడు. అయితే ఆయ‌న‌ను విడిచిపెట్టాలంటే లంచం ఇవ్వాల‌ని అడుగుతున్నార‌ని బాధిత మ‌హిళ పేర్కొంది. ఇవ్వనని చెప్పడంతో తనను కింద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని ఆరోపించింది. అనంతరం గ్రామస్తుల జోక్యంతో తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తంచేసింది.

దుర్గాదస్‌పూర్‌లో స్నేహితులతో క‌లిసి శివం యాదవ్ అనే వ్యక్తి జూదం ఆడుతుంటే అరెస్టు చేశామ‌ని ఎస్సై తెలిపాడు. అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించి.. తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్‌ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కాన్పూర్‌ ఎస్పీ చౌదరి స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పటేల్‌ను భోగిన్‌పూర్‌ విధుల నుంచి తప్పించామని, ఘటనపై దర్యాప్తు చేయించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై విపక్షాలు.. యోగి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశాయి.

వీడియో..

Also Read:

Hyderabad: యువతులను రప్పించి.. హోటల్‌‌లో గుట్టుగా వ్యభిచారం.. ఆ తర్వాత ఏమైందంటే?

Tirupati Accident: భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి.. మరో 9 మందికి తీవ్రగాయాలు..

Follow Us
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!