IAF Agnipath scheme: త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పథకం ‘అగ్నిపథ్ (Agnipath). జూన్ 14న ప్రకటించిన ఈ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పలుచోట్ల నిరసనకారులు రైల్వే ఆస్తులను తగలబెట్టారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతాకాదు. ఈక్రమంలో అగ్నిపథ్ స్కీమ్‌పై ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఓ వైపు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే మరోవైపు ఈ స్కీమ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్ (IAF). శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా మూడు రోజుల్లోనే 59, 960 దరఖాస్తులు వచ్చినట్లు వాయుసేన వెల్లడించింది. కాగా దరఖాస్తుల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు, జత చేసిన స్కాన్ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు.
ఎన్‌సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు..
అగ్నిపథ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్ల పూర్తయ్యాక మొత్తం అగ్ని వీరుల్లో 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు త్రివిధ దళాల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను 2022 డిసెంబర్ 11 నాటికి ప్రకటించనున్నారు. కాగా ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నిరసనలు వ్యక్తం కావడంతో పాటు గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో 2022 రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని కేంద్రం 23 ఏళ్లకు పెంచింది.
56960 !
That’s the total number of applications received till date from future #Agniveers in response to the #Agnipath recruitment application process on https://t.co/kVQxOwkUczRegistration closes on 05 July 2022.
Details about the process available on the website. pic.twitter.com/fkq4HQ3cbx
— Indian Air Force (@IAF_MCC) June 26, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..