భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు..!

| Edited By:

Aug 29, 2019 | 8:17 PM

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పలు సాంకేతిక కారణాలతో కొన్ని ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోల్పోయింది. దీంతో ఆ భర్తీ స్థానాన్ని పూడ్చేందుకు సిద్ధమైంది. రక్షణావసరాల కోసం 33 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిలో పన్నెండు సుఖోయ్-30 విమానాలు, 21 మిగ్-29 విమానాలను కొనేందుకు ప్రణాళిక రూపొందించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో కొద్ది వారాల్లో జరగనున్న […]

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు..!
Follow us on

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పలు సాంకేతిక కారణాలతో కొన్ని ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోల్పోయింది. దీంతో ఆ భర్తీ స్థానాన్ని పూడ్చేందుకు సిద్ధమైంది. రక్షణావసరాల కోసం 33 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిలో పన్నెండు సుఖోయ్-30 విమానాలు, 21 మిగ్-29 విమానాలను కొనేందుకు ప్రణాళిక రూపొందించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో కొద్ది వారాల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశం చర్చకు రానుంది. ఇప్పటి వరకు భారత్ కోల్పోయిన సుఖోయ్-30 విమానాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టనున్నారు. భారత్ వద్ద ప్రస్తుతం మిగ్-29కు సంబంధించి మూడు స్క్వాడ్రన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విషయమై ఇప్పటికే రష్యాతో చర్చలు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా ఈ చర్చలు పూర్తి చేసి, ఒప్పందం కుదుర్చుకునే దిశగా వాయుసేన అడుగులు వేస్తోంది.