Himachal Pradesh Landslide: విరిగి పడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన బస్సు, ప్రమాదంలో 40 మంది..

Himachal Pradesh Landslide: ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందన్న దానికి హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదం సాక్ష్యంగా నిలుస్తోంది. కిన్నౌర్‌ జిల్లోని రెఖాంగ్‌ పీయో - షిమ్లా జాతీయ రహదారిపై బుధవారం...

Himachal Pradesh Landslide: విరిగి పడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన బస్సు, ప్రమాదంలో 40 మంది..
Landslide Himachal

Updated on: Aug 11, 2021 | 2:38 PM

Himachal Pradesh Landslide: ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందన్న దానికి హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదం సాక్ష్యంగా నిలుస్తోంది. కిన్నౌర్‌ జిల్లోని రెఖాంగ్‌ పీయో – షిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు రెస్క్కూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆపరేషన్‌ పూర్తికాగానే చెబుతామని అధికారులు వివరించారు. సంఘటన స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాందోళనలు కలిగిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ ప్రదేశంలో ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు. గత నెల సంగాల్‌ లోయల్‌ ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఢిల్లీకి చెందిన 9 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల ధాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసం అయ్యాయి.

Also Read: Kadapa District Double Murder: కడప జిల్లా డి నేలటూరు డబుల్ మర్డర్స్ కేసులో వీడిన మిస్టరీ

Boy died: హైటెక్ సిటీ గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఆడుకుంటూ వెళ్లి రోలింగ్ షెట్టర్‌లో చిక్కుకుని పదేళ్ల బాలుడు మృతి

Sleeping Tips : సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది..! ఆరోగ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది..?