India Corona: ఆందోళనకరంగా కరోనా.. ఆ రెండు రాష్ట్రాల నుంచే రెండు వేల కేసులు
దేశంలో(India) కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రెండు వేల వరకే ఉన్న కేసుల(Corona Cases) సంఖ్య ఒక్కరోజే వెయ్యి మేరకు పెరిగింది. దీంతో కొత్తగా కరోనా సోకిన వారి సంఖ్య 3,712కు చెరింది. పాజిటివిటీ రేటు...
దేశంలో(India) కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రెండు వేల వరకే ఉన్న కేసుల(Corona Cases) సంఖ్య ఒక్కరోజే వెయ్యి మేరకు పెరిగింది. దీంతో కొత్తగా కరోనా సోకిన వారి సంఖ్య 3,712కు చెరింది. పాజిటివిటీ రేటు తగ్గుతుందనుకుంటున్న తరుణంలో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముంబయి నగరంలోనే నిన్న ఒక్కరోజు 739 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అధిక సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లెక్కలతో దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ గా ఉన్న కేసుల సంఖ్య 19వేలు దాటేశాయి. బుధవారం 4.41 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,712 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మహారాష్ట్ర(Maharashtra) , కేరళ నుంచే రెండు వేలకు పైగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 2,584 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా మరో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ముంబయి, పుణె, ఠాణెలోని పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో బుధవారం నాటికి 3,475 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. అందులో దాదాపు 2,500 కేసులు ముంబయి ప్రాంతానికే చెందినవని ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపె చెప్పారు.
కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో మళ్లీ అందోళన నెలకొంది. ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి