Viral: లాడ్జీలో అనుమానాస్పదంగా గిఫ్ట్ బాక్స్‌లు.. పోలీసులు వెళ్లి చెక్ చేయగా

స్థానికంగా డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా.. వివిధ రకాల మాదకద్రవ్యాలు పార్శిళ్లలో దాచి ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేసే ఓ పెద్ద గ్యాంగ్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Viral: లాడ్జీలో అనుమానాస్పదంగా గిఫ్ట్ బాక్స్‌లు.. పోలీసులు వెళ్లి చెక్ చేయగా
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2022 | 12:32 PM

Chennai: డ్రగ్స్ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేయడం ఇప్పుడు ప్రభుత్వాలకు, పోలీసులకు పెద్ద టాస్క్‌గా మారింది. రోజుకో కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం అనువైన అన్ని మార్గాలను యూజ్ చేసుకుంటున్నారు.  జైల్లో వేసి తాట తీస్తున్నా.. డ్రగ్ పెడ్లర్స్ తగ్గేదే లే అంటున్నారు.  కఠిన కేసులు పెడుతున్నా.. మా దందా వదలం అన్నట్లు  బిహేవ్ చేస్తున్నారు.  తాజాగా  చెన్నైలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఫ్యాన్సీ గిఫ్ట్ బాక్సులు, రాడ్లలో డ్రగ్స్ తరలిస్తూ కిలోల లెక్కన అమ్ముతున్నారు. మెరీనా బీచ్‌, చెపాక్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌ సరఫరా అవుతోంది. ఓ లాడ్జీలో తనిఖీలు నిర్వహించడంతో ఈ దందా బయటపడింది. తనిఖీల్లో భారీగా డ్రగ్స్ గుర్తించారు. నాలుగున్నర కిలోల డ్రగ్స్( మెథాంఫేటమిన్,యాంఫేటమిన్) స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడ్డ డ్రగ్స్ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దందాకు సంబంధించి ఆరుగరిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి  శ్రీలంక మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ బట్వాడా జరుగుతున్నట్టు నిర్ధారించారు. అరెస్టు చేసిన వ్యక్తులు గత రెండేళ్లుగా దేశం నుంచి డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..