మందు దొరకక పాయె ! గొంతు తడారిపాయె !

ఢిల్లీ మందుబాబులకు కిక్కు ఇలా వఛ్చి అలా వెళ్ళిపోయింది. సోమవారం ఈ నగరంలో దాదాపు 100 మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం, ఒకరి మధ్య ఒకరికి సామాజిక దూరమన్న ప్రసక్తే లేకపోవడంతో కొద్ది సేపటికే చాలా షాపులను మూసివేశారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ గుంపులుగా చేరిన జనాన్ని చెల్లాచెదరు చేసేందుకు సిటీలో అనేక చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఒక లిక్కర్ షాపు వద్దకు కేవలం అయిదుగురినే […]

  • Umakanth Rao
  • Publish Date - 3:49 pm, Mon, 4 May 20
మందు దొరకక పాయె ! గొంతు తడారిపాయె !

ఢిల్లీ మందుబాబులకు కిక్కు ఇలా వఛ్చి అలా వెళ్ళిపోయింది. సోమవారం ఈ నగరంలో దాదాపు 100 మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం, ఒకరి మధ్య ఒకరికి సామాజిక దూరమన్న ప్రసక్తే లేకపోవడంతో కొద్ది సేపటికే చాలా షాపులను మూసివేశారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ గుంపులుగా చేరిన జనాన్ని చెల్లాచెదరు చేసేందుకు సిటీలో అనేక చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఒక లిక్కర్ షాపు వద్దకు కేవలం అయిదుగురినే అనుమతించాలని, ఒక్కొక్కరి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం గ్యాప్ ఉండాలని నిబంధనలు ఉన్నా.. వాటి ఊసే కనబడలేదు. ఎవరూ వాటిని పాటించిన జాడ కనబడలేదు. పొద్దెక్కతున్న కొద్దీ మందుబాబుల సంఖ్య పెరిగిపోతుండడంతో చేసేది లేక చాలా చోట్ల వీటిని మూసి వేశారు. లిక్కర్ దొరికినవాళ్లు మాత్రం మా లక్కే లక్కు అనుకుంటూ సంబరంగా మందు బాటిళ్ల బాక్సులతో  వెళ్లిపోయారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆల్కహాలు అమ్మకాలు జరగలేదు. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదని, ఎక్సయిజు  శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని షాపుల ఓనర్లు చెప్పడంతో ప్రజలు ఉసూరుమంటూ వెనుదిరిగారు. యూపీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఏడు గంటలవరకు లిక్కర్ షాపులను అనుమతించారు. చాలా చోట్ల మందుబాబుల క్యూలు చాంతాడంత కనిపించాయి. మధ్యప్రదేశ్ లో రేపటి నుంచి లిక్కర్ అమ్మకాలు జరగనున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పెద్దగా ప్రజల సందడి కనిపించలేదు.