AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ ప్రజలకు స్వీట్ న్యూస్.. ఈ వార్త చూశారంటే.. పూర్తి వివరాలు ఇవిగో

దేశ రాజధాని ఢిల్లీలో మోస్ట్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్ స్పోర్ట్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అందుబాటులోకి వచ్చింది.. యమునా తీరంలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ప్రారంభమవుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధి ప్రాధికారం (DDA) ఎయిర్ సఫారీ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యమునా రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదలవుతోంది.

ఢిల్లీ ప్రజలకు స్వీట్ న్యూస్.. ఈ వార్త చూశారంటే.. పూర్తి వివరాలు ఇవిగో
Hot Air Ballons
Gopikrishna Meka
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2025 | 2:08 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో మోస్ట్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్ స్పోర్ట్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అందుబాటులోకి వచ్చింది.. యమునా తీరంలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ప్రారంభమవుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధి ప్రాధికారం (DDA) ఎయిర్ సఫారీ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యమునా రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదలవుతోంది. మొదటి దశలో రెండు ప్రదేశాలలో బాన్సేరా పార్క్ సరాయ్ కాలే ఖాన్ సమీపంలో, ITO-లక్ష్మీ నగర్ మధ్య అసితా ఈస్ట్ పార్క్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ జరగనున్నాయి..తదుపరి దశల్లో యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ (సూరజ్‌మల్ విహార్), కామన్‌వెల్త్ గేమ్స్ విలేజ్ ప్రాంతాల్లో కూడా ఈ సౌకర్యం విస్తరిస్తారు.

టెథర్డ్ (తాడుతో బిగించిన) హాట్ ఎయిర్ బెలూన్ రైడ్

ఢిల్లీలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ స్వేచ్ఛగా గాల్లో ఎగిరే రైడ్ కాదు..ఇది తాళ్ళతో కట్టేసిన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్..ఢిల్లీలో ఇప్పటివరకు ఫ్రీ-ఫ్లైయింగ్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ లేవు. రాజస్థాన్‌లోని పుష్కర్, జైపూర్, రణ్ ఆఫ్ కచ్ వంటి ప్రాంతాల్లో ఒక గంట పూర్తి ఎగురుడు రైడ్స్ అందుబాటులో ఉన్నాయి..ప్రస్తుతం ఢిల్లీలో ఎగిరే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ గరిష్టంగా 150 అడుగుల ఎత్తు వరకు ఈ బెలూన్ ప్రయాణిస్తుంది..DGCA ,AAI అనుమతి ప్రకారం ఇంత ఎత్తు వరకే ఇవి ప్రయాణించాలి..ఒక్కో రైడ్ సామర్థ్యం 5 ఇందులో ఒక లైసెన్స్‌డ్ పైలట్ తో పాటు నలుగురు ప్రయాణికులు ఉంటారు.. ఈ రైడ్ 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంటుంది.. ఉదయం 6:30 నుంచి 9:30 వరకు సాయంత్రం 4:00 నుంచి 6:30 వరకు స్లాట్లు ఉంటాయి..ఈ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణించాలంటే భారీగానే చెల్లించాలి..ఒక్కొక్కరికి టికెట్ ధర 3,000 + GST సుమారు 3,540 వరకు ఉంది

భద్రతా ప్రమాణాలతో బెలూన్ రైడ్

ఈ హాట్ ఎయిర్ బెలూన్ ను DGCA లైసెన్స్ ఉన్న పైలట్లు మాత్రమే నడిపిస్తారు..ఇప్పటికే భారత వాయుసేన , విమానాశ్రయ అథారిటీ AAI నుంచి పూర్తి అనుమతులు ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిర్వాహకులు పొందారు..సరైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే రైడ్స్ నిర్వహణ ఉంటుంది..ఇందులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది..ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ లో పాల్గొన్నారు.యమునా రివర్‌ఫ్రంట్‌ను ఎకో-టూరిజం హబ్‌గా మార్చే ప్రయత్నంలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు.

హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ బుకింగ్ ఎలా?

ఢిల్లీలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కి చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలి www.air-safari.in లేదా DDA అధికారిక పోర్టల్ ఫోన్ 011-23321121 DDA హెల్ప్‌లైన్ కి ఫోన్ చేసి బుక్ చేసుకోవాలి. శీతాకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆకాశం నుంచి ఢిల్లీ మరింత అందంగా కనిపించేలా ఢిల్లీ వాసులకు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఆనందాన్ని పంచనున్నాయి..ప్రయాణీకులు 360-డిగ్రీల విశాల దృశ్యాలను ఆస్వాదించవచ్చు.. పర్యాటకులు, ఢిల్లీ వాసులకు,సాహస ప్రియులకు ఈ రైడ్ ఆకర్షణీయంగా నిలుస్తుంది… ఈ రైడ్‌లు యమునా నదీ తీరం, వినోదభరితమైన పచ్చని ప్రదేశాలు, రైడ్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్‌మార్క్‌లను చూసేందుకు వీలు కల్పిస్తుంది..