AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగుల భద్రతలో నెంబర్ 1.. మై హోమ్ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయ అవార్డులు..

మై హోమ్ గ్రూప్ సంస్థలకు ప్రతిష్టాత్మక బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు ఈ గుర్తింపు దక్కింది. ఉద్యోగుల పిల్లలకు విద్య, ఆరోగ్యకరమైన ఆహారం వంటి సౌకర్యాలు కల్పిస్తూ మై హోమ్ తన నిబద్ధతను చాటుకుంది.

ఉద్యోగుల భద్రతలో నెంబర్ 1.. మై హోమ్ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయ అవార్డులు..
My Home Group
Krishna S
|

Updated on: Nov 29, 2025 | 1:05 PM

Share

దేశంలోని ప్రముఖ సంస్థలలైన మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అరుదైన గౌరవాన్ని పొందాయి. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, మంచి జీవితం, పర్యావరణ పరిరక్షణలో చాలా బాగా పనిచేసినందుకు ఈ సంస్థలకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. అవే ప్రతిష్టాత్మక బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ గౌరవ పురస్కారాలు. నవంబర్ 28న లండన్‌‌లోని డ్రేపర్స్ హాల్‌లో బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ అవార్డులను అందజేసింది. ఇవి నిరంతరం కష్టపడి మెరుగైన ఫలితాలు చూపిన వారికి మాత్రమే దక్కుతాయి. ఆరోగ్యం, భద్రత, ఉద్యోగుల శ్రేయస్సు పర్యావరణ ముప్పు నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు గాను ఈ అంతర్జాతీయ అవార్డులను అందిస్తారు.

My Home Group Awards 2

ఉద్యోగుల కోసం మై హోమ్ కృషి

ఈ సందర్భంగా మై హోమ్ ఇండస్ట్రీస్ గ్రూప్ వైస్ చైర్మన్ డిబీవీఎస్ రాజు మాట్లాడుతూ.. తమ సంస్థ ఉద్యోగుల సంక్షేమంపై తమ నిబద్ధతను తెలియజేశారు. ‘‘మా సిబ్బంది పిల్లలకు చదువు, ఆరోగ్యకరమైన భోజనం వంటి సదపాయాలు కల్పించడం ద్వారా మంచి భవిష్యత్తు ఉండేలా చూస్తున్నాము అని ఆయన అన్నారు. ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.. ఎవరూ తమ పని వల్ల ఇబ్బంది పడకూడదనే నినాదాన్ని మై హోమ్ సంస్థలు నిలబెట్టాయి. ఈ గుర్తింపు ద్వారా మన దేశంలోని కంపెనీలు కూడా ఉద్యోగుల సంరక్షణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నాయని స్పష్టమైంది.

My Home Group Awards

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..