హనీట్రాప్ కేసు : సీక్రెట్‌గా రాసలీలలు చిత్రీకరించారు.. కెమెరాలు ఎక్కడున్నాయో తెలుసా?

మధ్యప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న హానీ ట్రాప్ సెక్స్ స్కాంలో రోజుకో కొత్తవిషయం వెలుగులోకి వస్తోంది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాకారుల బలహీనతల ఆసరా చేసుకుని రాసలీలలు నడిపారు. అయితే వీటిని రహస్య కెమెరాలతో చిత్రీకరించి వాటితో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ కోట్లాది రూపాయలు సంపాదించినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీరు రాసలీలల దృశ్యాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించే సమయంలో వివిధ వస్తువుల్ని కెమెరాల కోసం ఉపయోగించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం కళ్లద్దాలు, లిప్‌స్టిక్‌లలో ఉన్నస్పై కెమెరాలతో […]

హనీట్రాప్ కేసు : సీక్రెట్‌గా రాసలీలలు  చిత్రీకరించారు.. కెమెరాలు ఎక్కడున్నాయో తెలుసా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 30, 2019 | 6:18 AM

మధ్యప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న హానీ ట్రాప్ సెక్స్ స్కాంలో రోజుకో కొత్తవిషయం వెలుగులోకి వస్తోంది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాకారుల బలహీనతల ఆసరా చేసుకుని రాసలీలలు నడిపారు. అయితే వీటిని రహస్య కెమెరాలతో చిత్రీకరించి వాటితో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ కోట్లాది రూపాయలు సంపాదించినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీరు రాసలీలల దృశ్యాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించే సమయంలో వివిధ వస్తువుల్ని కెమెరాల కోసం ఉపయోగించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం కళ్లద్దాలు, లిప్‌స్టిక్‌లలో ఉన్నస్పై కెమెరాలతో ఈ దృశ్యాలను చిత్రీకరించినట్టు వెల్లడించారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సెక్స్ స్కాంకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఓ హోటల్లో జరిపిన రాసలీలలు దృశ్యాలు, అలాగే ఓ హిందూత్వ సంస్ధకు చెందిన నాయకుడి సన్నిహితుని వీడియో కూడా హల్‌చల్ చేస్తోంది. అయితే అవి ఒరిజినలా కాదా అని విషయంలో క్లారిటీ లేదు. మధ్యతరగతి యువతులు, సెక్స్ వర్కర్లకు వలవేసి రాజీకీయ నేతలు, ఉన్నతాధికారులతో పనులు చేయించుకోడానికి ఈ దృశ్యాలు రికార్డు చేశారని విచారణ అధికారులు వెల్లడించారు.

ఇండోర్ మున్సిపల్‌ శాఖలో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులకు తమ విచారణలో నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. దీంతో కూపీ లాగి ఇప్పటివరకు ఆరుగురిని అదుపలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ స్కాంలో ఎవరెవరున్నారు, ఎంతమంది మోసపోయారు, ఎంతసొమ్ము పోగొట్టుకున్నారు అనే విషయాలపై కూడా పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆర్తి దయాల్, మోనిక యాదవ్, శ్వేత విజయ్‌ జైన్, శ్వేత స్వప్నిల్‌ జైన్, బర్ఖా సోని, ఓం ప్రకాశ్‌ కోరిలను సిట్‌ అధికారులు అరెస్ట్ చేశారు.