చమురు రంగంలో సౌదీ అరేబియా రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులు
తిరోగమనంలో పయనిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచేకూర్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రపంచలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా మన దేశంలో పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాల, మైనింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడిపెట్టనుంది. దాదాపు రూ.7 లక్షల కోట్ల( 100 బిలియన్ల డాలర్లు) పెట్టుబడి పెట్టాలని తమ దేశం భావిస్తున్నట్టు సౌదీ రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మొహమ్మద్ అల్ సతి చెప్పారు. చమురు, గ్యాస్, మైనింగ్ వంటి కీలక రంగాలలో భారత్‌తో దీర్ఘకాల […]
తిరోగమనంలో పయనిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచేకూర్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రపంచలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా మన దేశంలో పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాల, మైనింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడిపెట్టనుంది. దాదాపు రూ.7 లక్షల కోట్ల( 100 బిలియన్ల డాలర్లు) పెట్టుబడి పెట్టాలని తమ దేశం భావిస్తున్నట్టు సౌదీ రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మొహమ్మద్ అల్ సతి చెప్పారు. చమురు, గ్యాస్, మైనింగ్ వంటి కీలక రంగాలలో భారత్‌తో దీర్ఘకాల భాగస్వామ్యాన్ని అరబ్ దేశం కోరుకుంటుందన్నారు. సౌదీ అరేబియా పెట్టే పెట్టుబడులతో రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఇంధన సంబంధాల యొక్క వ్యూహాత్మక స్వభావాన్ని ప్రతిబింబించేలా అతిపెద్ద చమురు దిగ్గజం అరాంకో మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య భాగస్వామ్యం ఏర్పడనుంది.