WITT: మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్ షా
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై అమిత్‌షా విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారం అత్యాశతో ఏర్పడిన కూటమని అని చురకలు అంటించారు. కాంగ్రెస్ సొంత వంశాన్ని నియంత్రించలేకపోయిందని, రాహుల్ గాంధీని పదే పదే లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో...
టీవీ9 నెట్‌వర్క్ చేపట్టిన వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) పవర్ కాన్ఫరెన్స్ మూడో రోజు చివరి సెషన్ ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడారు. టీవీ9 వేదికపైకి వచ్చిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వందల సంఖ్యలో ఓటములను చవిచూసి ఇక్కడకు చేరిన బీజేపీ.. మోదీజీ నాయకత్వంలో గెలుపునకు అలవాటుపడిందన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై అమిత్‌షా విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారం అత్యాశతో ఏర్పడిన కూటమని అని చురకలు అంటించారు. కాంగ్రెస్ సొంత వంశాన్ని నియంత్రించలేకపోయిందని, రాహుల్ గాంధీని పదే పదే లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీకి గెలుపు అలవాటుగా మారిందని అమిత్ షా అన్నారు. ఎన్నో పరాజయాల తర్వాత బీజేపీ ఈరోజు ఈ స్థాయికి చేరుకుందని షా అన్నారు.
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ గందరగోళంపై షా మాట్లాడుతూ.. ఇందులో ప్రతిపక్ష పార్టీ పాత్ర లేదని అన్నారు. అయితే, కాంగ్రెస్ తనంతట తానుగా చీలిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత అస్థిరత్వమే ప్రతిసారీ ఇలాంటి పరిస్థితికి దారి తీస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, భారత కూటమిలోనూ చీలిక ఉందని అమిత్ షా అన్నారు. ఎందుకంటే భారత కూటమి సభ్యులు మాత్రమే వివిధ రాష్ట్రాల్లో ముఖాముఖి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. అటువంటి పరిస్థితిలో, వారి మధ్య స్థిరత్వం ఎలా ఉంటుందని అమిత్ షా ప్రశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..