అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ప్రకటన
హోమంత్రి అమిత్ షా ఆరోగ్యంపై ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి ప్రకటనను జారీ చేసింది. ఆగస్టు 30న డిశ్చార్జి సమయంలో ఇచ్చిన
press note Amit Shah: హోమంత్రి అమిత్ షా ఆరోగ్యంపై ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి ప్రకటనను జారీ చేసింది. ఆగస్టు 30న డిశ్చార్జి సమయంలో ఇచ్చిన సూచన మేరకే అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్ సమావేశాల కంటే ముందు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షల కోసం అమిత్ షా ఎయిమ్స్‌లో చేరారని, 1-2 రోజుల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుని గత నెల 31న ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అమిత్ షా.. శనివారం రాత్రి మళ్లీ ఆసుపత్రిలో చేరారు. శ్వాససంబంధ సమస్యలతో బాధపడుతూ ఆయన ఎయిమ్స్ చేరినట్లు వార్తలు వినిపించాయి. అయితే సాధారణ చెకప్ కోసమే అమిత్ షా వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Read more:
నేపాల్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు మృతి