AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ అన్ని లైన్లలో మెట్రో పరుగులు.. శనివారం లక్షన్నర మంది ప్రయాణం

ఢిల్లీ మెట్రోలోని అన్ని లైన్లలో మెట్రో సేవలను ప్రారంభించడంతో శనివారం మొత్తం లక్షన్నరమంది ప్రయాణాలు సాగించినట్లు ఢిల్లీ మెట్రో అధికారుల ప్రకటించారు.

ఢిల్లీ అన్ని లైన్లలో మెట్రో పరుగులు.. శనివారం లక్షన్నర మంది ప్రయాణం
Balaraju Goud
|

Updated on: Sep 13, 2020 | 11:58 AM

Share

ఢిల్లీ మెట్రోలోని అన్ని లైన్లలో మెట్రో సేవలను ప్రారంభించడంతో శనివారం మొత్తం లక్షన్నరమంది ప్రయాణాలు సాగించినట్లు ఢిల్లీ మెట్రో అధికారుల ప్రకటించారు. సమయ్‌పూర్ బాదలీ- గురుగ్రామ్ మధ్య ఎల్లో లైన్‌ మెట్రోలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు వెల్లడించారు.ద్వారకా- నజఫ్‌గఢ్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య అత్యల్పంగా ఉన్నట్లు తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా ప్రధాన న‌గ‌రాల్లో మెట్రో రైలు స‌ర్వీసు సేవ‌లు మొదలయ్యారు. 169 రోజుల త‌ర్వాత ఢిల్లీ మెట్రో ప‌రుగులు తీసింది. మార్చిలో విధించిన లాక్‌డౌన్ నుంచి మెట్రో స‌ర్వీసులు నిలిచిపోయాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప‌లు న‌గ‌రాల్లోని మెట్రో స‌ర్వీసుల‌న్నీ ర‌ద్దు అయ్యాయి. అయితే, అన్‌లాక్‌4 ద‌శ‌లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి ఢిల్లీ, నోయిడా, ల‌క్నో, బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో మెట్రో స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీలో ఎల్లో, బ్లూ, రెడ్ లైన్‌లో స‌ర్వీసులు న‌డుస్తున్నాయి. కేవ‌లం స్మార్ట్ కార్డు ద్వారానే ఎంట్రీ కల్పిస్తున్నారు.

ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఢిల్లీ మెట్రోలో మొత్తం 1,52,845 మంది ప్రయాణించారు. వీరిలో అత్యధికంగా 44,949 మంది ఎల్లో‌లైన్, బ్లూ లైన్‌ మెట్రోలలో 42,177 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కాగా, ద్వారక-నజఫ్‌గఢ్ మార్గంలో అత్యల్పంగా 621 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే శనివారమే ప్రారంభమైన ఎయిర్ పోర్టు‌లైన్‌లో 2,268 మంది ప్రయాణాలు సాగించినట్లు ఢిల్లీ మెట్రో అథారిటీ వెల్లడించింది.

Follow Us
12 కోట్ల ఖరీదైన అయ్యర్ ఇల్లు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
12 కోట్ల ఖరీదైన అయ్యర్ ఇల్లు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..