చెన్నై పోలీసులకు ధనుష్, విజయకాంత్ ఇంట్లో బాంబులు పెట్టామంటూ ఫోన్ కాల్స్
గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రో, అపరాత్రో పోలీసులకు ఫోన్ చేస్తారు.. ఫలానా చోట బాంబులు పెట్టామని బెదిరిస్తారు.. అది ఆకతాయిల పని అయి ఉండవచ్చని పోలీసులు గమ్మున ఉండలేరు కదా! గత కొన్ని రోజులుగా చెన్నై పోలీసులకు ఇదే పనిగా మారింది..
గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రో, అపరాత్రో పోలీసులకు ఫోన్ చేస్తారు.. ఫలానా చోట బాంబులు పెట్టామని బెదిరిస్తారు.. అది ఆకతాయిల పని అయి ఉండవచ్చని పోలీసులు గమ్మున ఉండలేరు కదా! గత కొన్ని రోజులుగా చెన్నై పోలీసులకు ఇదే పనిగా మారింది.. నిన్నటికి నిన్న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెన్నైలోని సినీనటులు ధనుష్, విజయకాంత్ ఇంట్లో బాంబులు ఉన్నాయని చెప్పాడు.. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు ధనుష్ ఉంటున్న అభిరామపురానికి, విజయ్‌కాంత్ ఉంటున్న విరుగంబాక్కానికి పరుగెత్తుకుంటూ వెళ్లారు.. వెంట బాంబులను నిర్వీర్యం చేసే బృందాన్ని కూడా తీసుకెల్లారు.. అక్కడికి వెళ్లి గంటల కొద్దీ వెతికారు.. అక్కడ వారికి ఎలాంటి బాంబులు దొరకలేదు.. ఇది కూడా ఆకతాయి పనేనని భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు.. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ ఆకతాయిని పట్టుకునే పనిలో పడ్డారు.. చెన్నై పోలీసులకు ఇదేం కొత్త కాదు.. కొన్ని నెలల కిందట సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంట్లో బాంబు ఉందని ఫోన్ చేసి చెప్పారు.. రజనీకాంత్ ఇంటికి హుటాహుటిన వెళ్లిన పోలీసులు అణువణువూ వెతికారు.. అదో మతిస్థిమితం లేని బాలుడు చేసిన ఫోన్ కాల్ అని తర్వాత తెలుసుకున్నారు.. పోలీసులకు హీరో అజిత్, విజయ్ ఇళ్లల్లో కూడా బాంబులు పెట్టినట్టు బెదిరింపులు ఫోన్‌లు వచ్చాయి.. వారంతా సెలెబ్రిటీలు కావడంతో పోలీసులు తేలిగ్గా తీసుకోవడం లేదు.. ఫోన్ కాల్ వచ్చిన ప్రతీసారి అలెర్టవుతున్నారు..