Raj Bhavan Bomb Threat: రాజ్ భవన్‌లో బాంబు పెట్టాం.. ఆలస్యం చేస్తే మీకే నష్టం.. బెదింపు కాల్ కలకలం..!

ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా గవర్నర్ బంగ్లా రాజ్‌భవన్‌లోనే బాంబు పెట్టామని హెచ్చరించారు. కొందరు ఫోన్లు చేసి పోలీసులకు, ప్రజలకు, అధికారులకు నిద్రలేకుండా చేశారు. రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, రాజ్‌భవన్‌ను తనిఖీ చేశారు.

Raj Bhavan Bomb Threat: రాజ్ భవన్‌లో బాంబు పెట్టాం.. ఆలస్యం చేస్తే మీకే నష్టం.. బెదింపు కాల్ కలకలం..!
Karnataka Raj Bhavan

Updated on: Dec 12, 2023 | 12:56 PM

ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా గవర్నర్ బంగ్లా రాజ్‌భవన్‌లోనే బాంబు పెట్టామని హెచ్చరించారు. కొందరు ఫోన్లు చేసి పోలీసులకు, ప్రజలకు, అధికారులకు నిద్రలేకుండా చేశారు. రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, రాజ్‌భవన్‌ను తనిఖీ చేయగా, బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలింది. దీంతో విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుల కోసం గాలిస్తున్నారు.

డిసెంబర్ 11 రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రాజ్ భవన్ లో బాంబు పెట్టినట్లు ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. రాజ్‌భవన్‌ సెక్యూరిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అది బూటకపు బాంబు కాల్ అని తేల్చేశారు.

బెంగళూరులో ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్ పెరుగుతున్నాయి. సరిగ్గా 12 రోజుల క్రితం డిసెంబర్ 1న బెంగళూరులోని 60కి పైగా ప్రైవేట్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పాఠశాల యాజమాన్యం షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని పాఠశాలలను తనిఖీ చేశారు. అప్పుడు అది ఫేక్ బాంబు బెదిరింపు కాల్ అని తేల్చేశారు. విషయం తెలియడంతో పాఠశాలలకు వెళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకొచ్చారు. ఆ రోజు పాఠశాలకు సెలవు ప్రకటించింది స్కూల్ యాజమాన్యం.

గతంలోనూ 15 పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో దాదాపు 48 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలిసింది. బన్నెరఘట్టలోని 7 పాఠశాలలు, హెబ్బగోడిలో 4 పాఠశాలలు, సర్జాపూర్‌లో 5 పాఠశాలలు, జిగానిలోని 2 పాఠశాలలకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. బెంగళూరులోని సౌత్ జోన్-1లో 15, సౌత్ జోన్ 2లో 3, జోన్ 3లో 10, జోన్ 4లో 4 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉత్తర మండలాల్లోని 7 పాఠశాలలు, సనేకల్ తాలూకాలోని 5 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద ఆదేశాల మేరకు పాఠశాలలకు బాంబు బెదిరింపులకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్లలో ఎఫ్ ఐఆర్ లు నమోదయ్యాయి. మొత్తం 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..