బ్రేకింగ్ : హిజ్బుల్ టాప్ కమాండర్ హమాద్ ఖాన్ హతం
కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కి భారీ షాక్ తగిలింది. ఈ సంస్థ టాప్ కమాండర్ హమాద్ ఖాన్ హతమయ్యాడు. ఆదివారం జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలతో జరిగిన ఎన్ కౌంటర్లో హమాద్ మృతి చెందాడు. అక్కడి ట్రాల్ ప్రాంతంలో ఇతనితో బాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు .ఆ దరిదాపుల్లో మరో టెర్రరిస్టు దాగి ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 2017 లో సబ్జర్ అహ్మద్ భట్ మరణించిన అనంతరం… హమాద్ హిజ్బుల్ […]
కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కి భారీ షాక్ తగిలింది. ఈ సంస్థ టాప్ కమాండర్ హమాద్ ఖాన్ హతమయ్యాడు. ఆదివారం జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలతో జరిగిన ఎన్ కౌంటర్లో హమాద్ మృతి చెందాడు. అక్కడి ట్రాల్ ప్రాంతంలో ఇతనితో బాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు .ఆ దరిదాపుల్లో మరో టెర్రరిస్టు దాగి ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 2017 లో సబ్జర్ అహ్మద్ భట్ మరణించిన అనంతరం… హమాద్ హిజ్బుల్ కమాండర్ అయ్యాడు.
2017 మే నెలలో ట్రాల్ ప్రాంతంలోనే జరిగిన ఎన్ కౌంటర్ ఆపరేషన్ లో భట్ చనిపోయాడు. ఆ ఘటన తరువాత శ్రీనగర్ తో బాటు అనంత నాగ్, బడ్గామ్, పుల్వామా తదితర జిల్లాల్లో ఘర్షణలు రేగాయి. ఆ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. కాగా-కొందరు టెర్రరిస్టులు ట్రాల్ ఏరియాలోని ఓ భవనంలో దాగి ఉన్నారన్న సమాచారం అందడంతో ఈ ఉదయం అక్కడి గుల్షన్ పోరా ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్లు మొదలుపెట్టాయి. వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని, సెక్యూరిటీ దళాల కాల్పుల్లో హమాద్ మృతి చెందాడని తెలుస్తోంది.