Karnataka: హెచ్‌ఐవీ సోకిన విషయాన్ని దాచిపెట్టిన భర్త.. భార్యకు కూడా సోకిన వైరస్.. బాధితురాలు ఏం చేసిందంటే..

|

Jan 15, 2022 | 10:13 AM

హెచ్‌ఐవీ సోకిన విషయాన్ని దాచిపెట్టాడని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అతని కారణంగానే తాను కూడా

Karnataka: హెచ్‌ఐవీ సోకిన విషయాన్ని దాచిపెట్టిన భర్త.. భార్యకు కూడా సోకిన వైరస్.. బాధితురాలు ఏం చేసిందంటే..
Follow us on

హెచ్‌ఐవీ సోకిన విషయాన్ని దాచిపెట్టాడని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అతని కారణంగానే తాను కూడా వైరస్ బాధితురాలిగా మారిపోయానని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. కర్ణాటకలోని బసవన్న గుడి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బసవన్న గుడి పోలీసులు అందించిన సమాచారం మేరకు.. బాధితురాలు ఓ ప్రముఖ సంస్థలో ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఓ ప్రైవేట్‌ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసే ఇంజినీర్‌తో ఆమెకు 2018లో వివాహమైంది. వివాహ సమయంలో వరుడికి భారీగానే కట్నకానుకలు ముట్టచెప్పారు వధువు తల్లిదండ్రులు. ఆతర్వాత కూడా కంప్యూటర్‌ కోర్సుల చదువుతున్నానంటూ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలను తీసుకున్నాడు. చివరకు భార్య నగలను కూడా తీసుకుని కట్టుబట్టలతో ఆమెను బయటకు పంపించాడు. కాగా ఇటీవల నిందితుడికి హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు కూడా హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దురదృష్టవశాత్తూ ఆమెకు కూడా పాజిటివ్‌గానే వచ్చింది. ఈ క్రమంలో భర్త కారణంగానే తనకు హెచ్‌ఐవీ సోకిందని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బసవన్న గుడి పోలీసులను ఆశ్రయించింది. వివాహాని కంటే ముందే తన భర్తకు హెచ్‌ఐవీ సోకిందని, అయితే అతను ఈ విషయం దాచిపెట్టాడని బాధితురాలు వాపోయింది. హనీమూన్‌ సమయంలో కూడా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడని, కారణమడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడంది. ఆ తర్వాత ఇంటికొచ్చాక తనను అదనపు కట్నం పేరుతో వేధించాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

Also Read:Kamareddy: కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు.. 23 మంది అరెస్ట్‌..

ఆకాశంలో రెండు హాట్‌ఎయిర్‌ బెలూన్ల మధ్య ఎలాంటి సహాయం లేకుండా నడిచిన వ్యక్తి !! వీడియో

Education: పదో తరగతి చదివేవారికి శుభవార్త.. ఇకపై వారు కూడా ఫైనల్ పరీక్షలు రాయచ్చు..