Wagh nakh: లండన్ నుంచి భారత్‌కు చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం.. అఫ్జల్ ఖాన్‌ను చంపిన వాఘ్ నఖ్ ప్రదర్శన.. ఎప్పటి నుంచి అంటే

|

Jul 18, 2024 | 12:35 PM

బీజపూర్ సేనాధిపతి అఫ్జల్‌ఖాన్‌ను చంపేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వాఘ్‌ నఖ్‌ను ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. ‘వాఘ్ నఖ్’ అనేది ఉక్కు ఆయుధం. ఇది ఒక బార్‌పై అమర్చబడిన నాలుగు గోళ్లను కలిగి ఉంటుంది. ఈ ఆయుధాన్ని బుధవారం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుండి ముంబైకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాఘ్ నఖ్‌ను సతారాకు తరలించారు.

Wagh nakh: లండన్ నుంచి భారత్‌కు చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం.. అఫ్జల్ ఖాన్‌ను చంపిన వాఘ్ నఖ్ ప్రదర్శన.. ఎప్పటి నుంచి అంటే
Shivaji's Wagh Nakh
Follow us on

హిందూ దేశాన్ని ఏలుతున్న మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి.. హిందూ సామ్రాజ్యాన్ని పునర్మించిన యోధుడు.. పరాయిపాలకుల చేతిలో బంధీ అయిన మాతృభూమి సంరక్షణ కోసం బెబ్బులిలా కధనరంగంలో దూకిన మహావీరుడు.. తల్లి చెప్పిన కథలనే స్పూర్తిగా తీసుకుని 16 ఏళ్ల పిన్న వయసులోనే కత్తి పట్టి కదన రంగంలో దూకిన ధీరుడు .. అమ్మవారి అనుగ్రహంతో తాను చేసిన యుద్ధాల్లో ఒక్కటి కూడా ఓడిపోని ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్ నఖ్ అనే ఆయుధం భారత్ గడ్డ మీద అడుగు పెట్టింది.

బీజపూర్ సేనాధిపతి అఫ్జల్‌ఖాన్‌ను చంపేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వాఘ్‌ నఖ్‌ను ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. ‘వాఘ్ నఖ్’ అనేది ఉక్కు ఆయుధం. ఇది ఒక బార్‌పై అమర్చబడిన నాలుగు గోళ్లను కలిగి ఉంటుంది. ఈ ఆయుధాన్ని బుధవారం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుండి ముంబైకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాఘ్ నఖ్‌ను సతారాకు తరలించారు. అక్కడ జూలై 19 నుంచి వాఘ్‌ నఖ్‌ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.

మ్యూజియంలో వాఘ్‌ నఖ్‌ ప్రదర్శనను ఆ రాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే, DCMలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రారంభిస్తారు. చరిత్రకారుడు ఇంద్రజిత్ సావంత్ తన వద్ద విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం రాసిన లేఖ ఉందని పేర్కొన్నారు. అనంతరం మహా రాష్ట్ర ప్రభుత్వం వాఘ్‌ నఖ్‌ ను ముంబైకి తీసుకుని రావడంపై వివాదం చెలరేగింది. అంతేకాదు అసలు మహారాష్ట్రకు తీసుకువచ్చిన వాఘ్‌నఖ్ చత్రపతి ఉపయోగించినదేనా అనే విషయం ఖచ్చితంగా తెలియాలి అని డిమాండ్ చేశారు. అఫ్జల్ ఖాన్‌ని చంపడానికి శివాజీ మహారాజ్ ఉపయోగించినది ఈ ఆయుధమే అని ప్రభుత్వం స్పష్టం చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇవి కూడా చదవండి

ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నాటి ఇతర కళాఖండాలు, ఆయుధాలతో పాటు వాఘ్ నఖ్ గురువారం సాయంత్రంలోగా సతారా మ్యూజియంలో ఉంచబడుతుంది. ప్రత్యేక ఎగ్జిబిట్‌తో పాటు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేయనున్నట్టు మంత్రి సుధీర్ ముంగతివార్ తెలిపారు.

వాఘ్‌ నఖ్‌ ప్రదర్శన విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక కమిటీ ముంబైలో మరొక కమిటీ సతారా, కొల్హాపూర్, నాగ్‌పూర్ జిల్లాల్లో వాఘ్ నఖ్ ప్రదర్శించడానికి ప్రతిపాదించాయి. వాగ్ నఖ్ భద్రత విషయంలో ఈ కమిటీలో ఒక భాగం.. ఈ కమిటీలో స్థానిక జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్, లేదా పోలీసు సూపరింటెండెంట్, PWD అధికారులు, మ్యూజియం అధికారులు ఉన్నారు. ఈ కమిటీ వాగ్ నఖ్ ప్రదర్శన కోసం ప్రణాళికలను రూపొందిస్తుంది. ముంబై కమిటీకి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ (CSMVS) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సబ్యసాచి ముఖర్జీ నేతృత్వం వహిస్తారు. ప్రభుత్వ తీర్మానం (GR) ప్రకారం సతారాలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, నాగ్‌పూర్‌లోని సెంట్రల్ మ్యూజియం, కొల్హాపూర్‌లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , ముంబైలోని CSMVS అనే నాలుగు మ్యూజియంలలో వాఘ్ నఖ్ ప్రదర్శించబడుతుంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..